తెలుగు సినిమా చరిత్ర పుటలు తిరగేస్తే ఖచ్చితంగా ఉండాల్సిన సినిమా.. ఉండే సినిమా పాతాళ భైరవి అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా ఉన్నంత కాలం పాతాళ భైరవి సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన మొదటి సినిమా పాతాళ భైరవి అనడంలో సందేహం లేదు. క్లాసిక్ మూవీగా నిలిచి పోయిన పాతాళ భైరవిలోని ప్రతి ఎలిమెంట్ కూడా అద్బుతం అంటారు. ఫిల్మ్ మేకింగ్ పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాతాళ భైరవి చూడాల్సిందే అంటారు. కొన్ని వందలు వేల సినిమాల్లో పాతాళ భైరవి సినిమా కు సంబంధించిన ప్రస్థావన ఉంది. అంతటి అద్బుత ఆణిముఖ్యం 'పాతాళ భైరవి' విడుదల అయ్యి 70 ఏళ్లు పూర్తి చేసుకుంది.
కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను బి నాగిరెడ్డి.. చక్రపాణిల నిర్మాతల ద్వయం నిర్మించారు. ఎన్టీఆర్ మరియు ఎస్వీఆర్ లు పోటీ పడి మరీ నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాలతి వారితో సరి ఉజ్జీగా నటించి మెప్పించారు. పాతాళ భైరవి సినిమాలోని తోట రాముడి పాత్రను బేస్ చేసుకుని కొన్ని వందల పాత్రలను తెలుగు మరియు ఇతర భాషల్లో రచయితలు కథలు రాసుకుని ఉంటారు. ఇక విలన్ ఇలా కూడా ఉంటాడు అని నెపాల మాంత్రికుడి చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇన్సిపైర్ అయ్యి ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికి ఎప్పటికి వర్ధమాన ఫిల్మ్ మేకర్స్ కు సీనియర్ ఫిల్మ్ మేకర్స్ కు ప్రేక్షకులకు అందరికి ఇష్టమైన సినిమా పాతాళ భైరవి అనడంలో సందేహం లేదు.
1951 లో టెక్నాలజీ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి లో టెక్నికల్ వనరులు ఉన్న సమయంలో కూడా పాతాళ భైరవి సినిమా లో కెమెరా ట్రిక్స్ ను ఉపయోగించి అద్బుతమైన విజువల్స్ ను క్రియేట్ చేశారు. దర్శకుడు మరియు నిర్మాతలకు సినిమా పై ఉన్న ప్యాషన్ వల్లే ఈ రేంజ్ సినిమా వచ్చింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఒక సర్వే నిర్వహించగా 100 గ్రేటెస్ట్ ఇండియన్ సినిమాల జాబితాలో పాతాళ భైరవి నిలిచింది. అంతటి అద్బుత పాతాళ భైరవి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా మరోసారి ఇండస్ట్రీ ఈ సినిమాను గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.