ట్రైలర్ టాక్: మీ ఆడోళ్లకస్సలు ఆగదానె

Update: 2020-02-06 10:43 GMT
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'.  ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారకార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.

"ఈ ప్రపంచంలో నిస్వార్థమైనదేదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలో కూడా నేను అనే రెండు అక్షరాలు సునామినే రేపగలవు. ఐ వాంటెడ్ టు బి ది వరల్డ్స్ ఫేమస్ లవర్" అని విజయ్ చెప్తున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. రాశి ఖన్నా ను పార్టనర్ గా.. ఐశ్వర్య రాజేష్ ను వైఫ్ గా.. కాథరిన్ ట్రెసా ను ఫాంటసీ గా.. ఇజబెల్ ను  గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేశారు.  నాలుగు విభిన్న షేడ్స్ లో విజయ్ ఒదిగిపోయాడనే చెప్పాలి.

 "వర్ యూ బోర్న్ బ్యూటిఫుల్ ఆర్ గ్రోన్ అప్ టు బి బ్యూటిఫుల్" అని సిటీ బాయ్ స్టైల్ లో డైలాగ్ చెప్పినా..  "మీ ఆడోళ్లకస్సలు ఆగదానె బట్టకొంటె ఒంటిమీద ఏసుడేనా" అని ఓ దిగువ మధ్యతరగతి వ్యక్తి లాగా తెలంగాణా మాండలికంలో  చెప్పినా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. బాడీ లాంగ్వేజ్ నుంచి డ్రెస్ వరకూ అచ్చుగుద్దినట్టుగా సరిపోయింది.

మరి ఈ నలుగురు ఎవరు.. విజయ్ కి వారికి మధ్య ఏం జరుగుతుంది ఎలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్నాయి అనేది చూపించారు. అయితే ఆ ఇంటెన్స్ ఎమోషన్స్ లో మాత్రం 'అర్జున్ రెడ్డి' ఛాయలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలైతేకానీ అసలు కథ ఏంటి అన్నది అర్థమయ్యేలా లేదు.  మరి ఆలస్యం ఎందుకు.. చూసేయండి 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్.

Full View

Tags:    

Similar News