దంగల్ లో ఆ సీన్ కు కోచ్ షాకయ్యారట!

Update: 2016-12-28 09:43 GMT
అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రెజ్లర్‌ మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన "దంగల్" సినిమా విడుదలకు ముందు నుంచీ హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లు గానే విడుదలయిన దగ్గరనుంచీ ప్రశంసలు, కలెక్షన్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి అనుకోని షాక్ ఒకటి తగిలింది. ఇంతకూ ఆ షాక్ ఏమిటంటే... గీత - బబిత ల రియల్ లైఫ్ కోచ్ ను ఒక విలన్ లా చిత్రీకరించడమేనట!

మహవీర్‌ సింగ్‌ తన కూతుళ్లు గీత - బబితలను రెజ్లర్లుగా తీర్చిదిద్దడమే ఇతివృత్తంగా తెరకెక్కిన "దంగల్" సినిమాలో వారి కోచ్‌ పీఆర్‌ కదం పాత్రను నెగిటివ్‌ ఇమేజ్‌ తో రూపొందించారని మండిపడుతున్నారు గీత - బబితల రియల్ లైఫ్ కోచ్ పీఆర్‌ సోంధీ. 2010 కామన్‌ వెల్త్‌ క్రీడల్లో గీతకు - బబితకు జాతీయకోచ్‌ గా వ్యవహరించిన సోంధీ... గీత ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా మహవీర్‌ సింగ్ ను ను ఒక గదిలో బంధించి ఆమె మ్యాచ్‌ చూడకుండా కుట్రపన్నినట్టు చూపించే సీన్‌ ఆ సినిమాలో ఉంది. ఇప్పుడు సమస్య అంతా ఆ సీనే! ఆ కోచ్ సోంధీ అభ్యంతరం కూడా ఈ సీనే!!

ఈ విషయాలపై స్పందించిన సోంధీ... మహవీర్‌ తనకు ఒకప్పటి మిత్రుడే అని వారి కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఈ సినిమా తాను చూడకపోయినప్పటికీ, తన పాత్ర ఆధారంగా తీసిన సీన్లలో తనను విలన్ గా చూపించిన సీన్ల గురించి తన శిష్యులు చెప్పారని, ఆ సీన్స్ గురించి విన్న అనంతరం నివ్వెరబోయానని చెబుతున్నారు. సినిమాలో చూపించిన విషయమే నిజమైతే... కామన్‌ వెల్త్‌ క్రీడల సందర్భంగా జాతీయ కోచ్‌ ఒకరిని గదిలో బంధించి ఉంటే ఆ విషయం గురించి మీడియాకు కానీ, పోలీసులకు కానీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు సోంధీ.

కేవలం సినిమాలో మసాలా జోడించడానికి ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ఏమాత్రం సరైన చర్య కాదని, ఈ విషయంలో నిర్మాతపై లీగల్‌ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నానని, అంతకంటే ముందుగా భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు సోంధీ!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News