కొద్ది రోజుల క్రితం మెగా ఫ్యామిలీ - ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల పై యండమూరి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపడం - వాటిపై నాగబాబు మండిపడడం తెలిసిందే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా యండమూరి ఆ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు. అసలు, ఆ వీడియో ప్రసంగం 5 సంవత్సరాల క్రితం చిత్రీకరించిందని - కొంత కాలం క్రితం అది వెలుగులోకి రావడంతో ఈ వివాదం చెలరేగిందని చెప్పారు. అసలు ఆ వీడియోలో తాను చెప్పిన విషయం వేరని - ఇద్దరు కుర్రవాళ్లు ఎలా పైకొచ్చారని చెప్పడమే తన ఉద్దేశమని చెప్పారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన పిల్లలు ఎక్కువగా ఉన్నారని - దాంతో - సినిమా హీరోల పేర్లయితే వారు బాగా కనెక్ట్ అవుతారని ఆ పేర్లను ఎంచుకున్నానని అన్నారు. గంట పాటు పవన్ కల్యాణ్ ను పొగిడానని - పవన్ అంటే గాలిని పీల్చి బ్రతికేవాడని - అంజనీ పుత్రుడని - ఆంజనేయుడని చెప్పానని అన్నారు. అయితే, తన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి - ఆ పోలికలు - సర్జరీలు చేయించుకున్న విషయాన్ని బాగా హైలైట్ చేశారని చెప్పారు.
ఆ వీడియో చూసిన తర్వాత నాగబాబు మీడియా ముందుకు వచ్చి తనపై మండిపడ్డారని తెలిపారు. వాస్తవానికి నాగబాబు ఏదో ఫంక్షన్ సందర్భంగా ఈ విషయం ప్రస్తావించాడని, తనకు ఆ విషయం తెలీదని చెప్పారు. తనకో ప్రముఖ డైరెక్టర్ ఫోన్ చేసి ఆ విషయం చెప్పి టీవీ చూడమన్నారని - అపుడు చూశానని చెప్పారు. ఆ తర్వాత ఓ టీవీ చానెల్ వారు ఫోన్ చేసి నాగబాబు వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరారని - నాగబాబు ఏదో ఆవేశంలో అని ఉంటాడని, ఆ విషయాన్ని అంతటితో వదిలేద్దామని తాను ప్రయత్నించానని, దానిలో పెద్ద విషయమేమీ లేదని అన్నారు. ఒక హీరో చేయించుకున్న సర్జరీల గురించి బహిరంగంగా విమర్శిస్తే ప్రేక్షకులలో చులకన భావం ఏర్పడవచ్చు కదా అన్న ప్రశ్నకు యండమూరి ఆసక్తి కర సమాధానమిచ్చారు. హీరో - హీరోయిన్ ల ముఖాన్ని గురించి కామెంట్ చేయడం తప్పని తాను ఎప్పుడు అనుకోలేదన్నారు. తన వ్యాఖ్యలను పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఒక పొట్టివాడు హీరో అయ్యాడని అనచ్చు...అని అన్నారు. అయితే, ఆ రోజు అక్కడున్న పిల్లలు రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చినవారని, వారి గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నానని ఆ మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు బదిలిచ్చారు.
శ్రీదేవి ముక్కు ఆపరేషన్ సమయంలో కూడా తాను కామెంట్ చేశానని చెప్పారు. తన హెయిర్ స్టైల్ బాగుండాలని హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. కొంతమంది హీరోలు కళ్లు బాగుండాలని ఇంజక్షన్స్ చేయించుకుంటారని, అటువంటి వాటిని తాను నెగటివ్ కామెంట్స్ అనుకోనని చెప్పారు. ఒక వ్యక్తి ఫిట్ గా ఉండడం కోసం రోజూ జిమ్ చేయడం, అందంగా ఉండడం కోసం సర్జరీలు చేయించుకోవడం ఒకటేనని అన్నారు. ఆ విషయంలో తాను పొరపాటుగా మాట్లాడానని అనుకోలేదన్నారు. అయితే, అది తనకు సంబంధం లేని విషయమని ఇప్పుడు అనుకుంటున్నానని, వాళ్ళు ఎలా పోతే తనకెందుకు అని అనిపిస్తోందన్నారు. అయితే, యండమూరి వివరణ ఇచ్చిన సంగతి పక్కన పెడితే, దానిని మెగా ఫ్యామిలీ - అభిమానులు ఏవిధంగా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.