అంతా కోరినట్లుగా '2.ఓ' లో చిన్న మార్పు

Update: 2018-11-30 13:18 GMT
భారీ అంచనాల నడుమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘2.ఓ’ చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ దక్కింది. 550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ చిత్రం భారీగా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. అన్ని ఏరియాల్లో కూడా మంచి ఓపెనింగ్స్‌ ను దక్కించుకున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఒక విషయంలో కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు శంకర్‌ 20 కోట్లు ఖర్చు చేసి యంతర లోకపు సుందరివే.. అనే పాటను భారీగా చిత్రీకరించాడు. రహమాన్‌ ఈ పాటను ట్యూన్‌ చేశాడు. సినిమా విడుదలకు చాలా నెలల ముందే ఈ పాట విడుదలైంది. పాటకు మంచి రెస్పాన్స్‌ కూడా దక్కింది. అయితే సినిమా పూర్తి అయ్యే వరకు కూడా ఆ పాట రాకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహంగా లేస్తున్నారు.

బయటకు వెళ్తున్న సమయంలో రోలింగ్‌ టైటిల్స్‌ వేస్తూ ఈ పాటను ప్లే చేస్తున్నారు. కొందరైతే పాటను చూడకుండానే బయటకు వెళ్తున్నారు. సినిమా స్క్రీన్‌ ప్లే సీరియస్‌ గా సాగుతున్న సమయంలో పాటను పెట్టడం వల్ల ఫ్లో దెబ్బ తింటుందనే ఉద్దేశ్యంతో శంకర్‌ ఆ పాటను త్యాగం చేశాడు. కాని ప్రేక్షకులు ఆ పాటను కోరుకుంటున్న నేపథ్యంలో రేపటి నుండి సెకండ్‌ హాఫ్‌ మద్యలో ఆ పాటను పెట్టబోతున్నారు. అన్ని భాషల్లో కూడా ఆ పాట ప్రేక్షకులు కోరుకున్న విధంగా రాబోతుందట. భారీగా తీసిన ఆ పాట వల్ల సినిమా రిచ్‌ నెస్‌ మరింతగా పెరుగుతందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఆపాట కోసం మళ్లీ ప్రేక్షకులు థియేటర్‌ కు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News