విజ‌య్ పెద్ద‌ స్టార్ అవుతాడ‌నుకోలేదు!

Update: 2019-07-13 12:25 GMT
టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. టాలీవుడ్ లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో దూసుకెళుతున్న మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోగా అత‌డి పేరు మార్మోగిపోతోంది. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టడ‌మే గాక `జాతీయ ఉత్త‌మ సినిమా`లో న‌టించిన హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటుపై అర్జున్ రెడ్డి- గీత గోవిందం సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. న‌టించిన అర‌డ‌జ‌ను సినిమాల్లోనే అత‌డు 100 కోట్ల క్ల‌బ్ రిజ‌ల్ట్ చూపించాడు. ట్యాక్సీవాలాతో మ‌రో బంప‌ర్ హిట్ అందుకున్నాడు. అందుకే విజ‌య్ స్థాయి ప్ర‌స్తుతం స్కైని ట‌చ్ చేస్తోంది.

అయితే ఇంత పెద్ద స్టార్ అవుతాడ‌ని అత‌డి ఫ్యామిలీ ముందే ఊహించ‌గ‌లిగిందా? అంటే అది ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ అని చెబుతున్నారు దేవ‌ర‌కొండ అంకుల్ య‌శ్ రంగినేని. విజయ్ దేవ‌ర‌కొండ ఆరంభ క‌ష్టాల గురించి య‌శ్ రంగినేని తాజా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశారు. ``ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత ఫోన్ చేసి విజ‌య్ కి కంగ్రాట్స్ చెప్పాను. మా అన్న‌య్య‌కు వాడిపై డౌట్ ఉండేది. అప్ప‌టికి ఇంత పెద్ద హీరో అవుతాడ‌ని అనుకోలేదు. అంద‌రం వ‌ద్దు అన్న‌వాళ్ల‌మే! నాక్కూడా కాన్ఫిడెన్స్ లేదు. ఆ టైమ్ లో ఫోన్ చేసి పెళ్లి చూపులు కు పెట్టుబ‌డి పెట్టు అన్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ మేం చేస్తున్నాం.. అద‌రం కొత్త‌వాళ్లం అన్నారు. నిర్మాత రాజు గారితో క‌లిసి ఆ సినిమాని నిర్మించాం`` అని తెలిపారు.

మా అన్న‌య్య‌కు వాడిపై తొలి నుంచి సందేహ‌మే. సినిమా ఇండ‌స్ట్రీ వ‌ద్దు.. ప‌రిశ్ర‌మ క‌ష్టాలు తెలుసు!! అని విజ‌య్ ని నిరాశ ప‌రిచాం అంద‌రం. `పెళ్లి చూపులు` చిత్రానికి 65 ల‌క్ష‌లు అవ‌స‌ర‌మైతే నా ఆస‌క్తి గురించి తెలిసి విజ‌య్ అడిగాడు. అయితే నాతో పాటు ఇంకా ఎవ‌రైనా ఉంటే బావుంటుంది అనుకుంటున్న టైమ్ లో రాజ్ కందుకూరి గారు క‌లిశాను. ఇద్ద‌రం  స‌గం స‌గం (30ల‌క్ష‌లు+ 30ల‌క్ష‌లు) పెట్టాం. పోయినా న‌ష్టం త‌గ్గుతుంది అనుకునే పెట్టాను... అని తెలిపారు. మ‌ధుర శ్రీ‌ధ‌ర్ తో క‌లిసి య‌శ్ రంగినేని నిర్మించిన `దొర‌సాని` ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో పై సంగ‌తుల్ని వెల్ల‌డించారు.

పెళ్లి చూపులు త‌ర్వాత దేవ‌ర‌కొండ కెరీర్ గురించి తెలిసింది. సోలో హీరోగా బంప‌ర్ హిట్ కొట్టి అటుపై వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో కెరీర్ ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాడు. ప్ర‌స్తుతం మైత్రి సంస్థ‌లో డియ‌ర్ కామ్రేడ్ (ఈనెల 26 రిలీజ్) చిత్రంలో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి హీరో అనే త్రిభాషా చిత్రంలోనూ విజ‌య్ న‌టిస్తున్నాడు.

Tags:    

Similar News