వైఎస్ ఆర్ బయోపిక్ 'యాత్ర' విడుదలకు సిద్దం అవుతోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ డేట్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 8న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి మరో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'పల్లెల్లో కల ఉంది పంటల్లో కలిముంది...' అంటూ సాగే ఈ పాట రైతుల కష్టాలను, కన్నీలను చూపించే విధంగా ఉంది.
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ పాటను గాన గాంధర్వుడు ఎస్వీ బాలసుబ్రమణ్యం ఆలపించారు. కృష్ణ కుమార్ సంగీతం అందించిన ఈ పాట ప్రతి ఒక్కరి గుండెను కదిలించేలా ఉంది. రైతుల కష్టాలు, కన్నీలను చూసి వైఎస్ ఆర్ తపించిన తీరు, పడ్డ మనో వేదనను ఈ పాటలో చూపించనున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ ఆర్ రైతుల కష్టాలను తెలుసుకునేందుకే పాద యాత్రను చేసిన విషయం తెల్సిందే. ఆ పాద యాత్ర సందర్బంగా ఈ పాట సినిమాలో రానుందట.
వైఎస్ ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముటీ పోషించగా, వైఎస్ రాజా రెడ్డి పాత్రను జగపతిబాబు పోషించాడు. ఇక ఈ చిత్రంలో అనసూయతో పాటు ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మించారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రయాణం మరియు ఆయన మరణంను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. సినిమా చివరి 20 నిమిషాలు రియల్ ఫుటేజ్ ను చూపించనున్నారట. జగన్ పాత్ర కూడా ఈ చిత్రంలో ఉంటుంది, స్వయంగా జగన్ కనిపించబోతున్నాడు. వైఎస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా కూడా ఈ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Full View