ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గించి.. ఆన్ లైన్ టికెటింగ్ పేరిట మొన్నటివరకూ సాగిన ఝంజాటానికి జగన్ సర్కార్ మంగళం పాడి జీవో జారీ చేసింది.
ఇక సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటున్న వేళ మరో కలకలం చెలరేగింది. కొత్త సినిమాల విడుదల చేస్తే తమకూ వాటా కావాలని థియేటర్ యజమానులకు రాసిన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొన్నటివరకూ ఏపీలో టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఫైట్ సాగింది. సినీ ఇండస్ట్రీ సమస్యలపై టాలీవుడ్ పెద్దలు అంతా కలిసి వెళ్లి మరీ జగన్ ను కలిశారు. వేడుకున్నారు.
పవన్ కళ్యాణ్ అంతకుముందు రిపబ్లిక్ డే మూవీ వేడుకలో చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం తారాస్థాయికి వెళ్లింది. అప్పటి నుంచి నలుగుతూ చిరంజీవి సహా సీన హీరోలు అంతా కలిసి ఈ సమస్యను ఎట్టకేలకు పరిష్కరించారు.
ఇక భీమ్లానాయక్ మూవీ విడుదల అయ్యే వరకూ జగన్ సర్కార్ ఈ జీవో విడుదల చేయలేదు. ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కావడంతో ఇదంతా ప్రభుత్వమే చేసిందని పవన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
వారు ఆరోపించినట్టుగా భీమ్లానాయక్ రిలీజ్ అయిన చాలా రోజుల గ్యాప్ తర్వాత రాధేశ్యామ్ సినిమా విడుదలకు సరిగ్గా టికెట్ ధరలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఆ వివాదం సద్దుమణిగింది.
అయితే తాజాగా వైసీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి రాసిన లేఖ సంచలనంగా మారింది. సినిమా థియేటర్లకు ఓ పెద్ద నగరానికి చెందిన మేయర్ పేరిట లేఖ సర్క్యూలేట్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఏపీలో చర్చకు దారితీసింది.
కొత్త సినిమా విడుదలైన సందర్భంగా తమకు ప్రతీ షోకి వంద టికెట్లు ఇవ్వాలని ఆ మహిళా ప్రజాప్రతినిధి లేఖలో థియేటర్ల యాజమాన్యాలకు లేఖ రాశారట.. కొత్త సినిమా రిలీజ్ అయిన సమయంలో తమకు ఎదురయ్యే ఇబ్బందులను ఆమె లేఖలో పేర్కొనడం విశేషం.
ఆ కార్పొరేషన్ పరిధిలోని సినిమా థియేటర్లలో టికెట్లు కావాలని పార్టీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కోరుతున్నారని.. అందుకే ఇవ్వాలని ఆమె నగర ప్రథమ పౌరురాలిగా లేఖలో కోరినట్టుగా ఉంది.
అయితే సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది ఒరిజినల్ లేఖనా? లేక ఎవరైనా ప్రత్యర్థులు కావాలనే సృష్టించిన ఫేక్ లేటర్ అన్నది తెలియాల్సి ఉంది.