ఇద్దరినీ వెనక తిప్పుకుంటున్న లక్ష్మి రాయ్

Update: 2018-12-30 04:33 GMT
పేరున్న కమెడియన్స్ హీరోలుగా మారడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా కామన్.  ఒకవేళ ఎవరైనా పాపులర్ కమెడియన్ కనుక లీడ్ రోల్ ఒక్క సినిమాకూడా చేయలేదంటే ప్రేక్షకులు వారిని వింతగా చూసే పరిస్థితి ఉంది.  అందుకేనెమో తెలుగు హాస్యనటుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్  మధు నందన్.. కమెడియన్ ప్రవీణ్ లు లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్నారు.  ఈ సినిమా టైటిల్ 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'.

మెగా స్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం 'ఖైది నం. 150' సినిమాలో రత్తాలు రత్తాలు పాట తో తెలుగువాళ్ళను మెప్పించిన హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  తాజాగా ఈ సినిమానుండి 'ఏ మాయ చేసిందో' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు హరి గౌర.  ఈ పాటకు అయన ట్యూన్ ఇవ్వడంతో పాటుగా గొంతు కూడా సవరించుకున్నాడు.  ఈ పాటకు సాహిత్యం అందించింది బాలాజీ.

"ఏ మాయ చేసిందో.. ఎమంత్రం వేసిందో.. చూపులతో తీసిందే ప్రాణం

ఊరించే ఆ అందం ఊహల్లో ఆనందం. గుండెల్లో గుచ్చిందే బాణం

ఆ కులుకే ఓ చురకై ఈ గొడవే తెచ్చిపెట్టిందే

ఆ హోయలె ఓ రైలై లోలోపల కూతే పెట్టిందే.."

ఇలాంటి  సింపుల్ పదాలతో ఫన్ టోన్ లో బాలాజీ ఈ పాటను రాయగా హరి గౌర దాన్ని మరింత అందంగా పాడాడు.  లక్మ్షి రాయ్ ప్రేమ మాయలో పడిపోయిన మధు నందన్.. ప్రవీణ్ లు ఇద్దరూ ఆమె వెనకాలే తిరుగుతూ.. ఆమెను ఆరాధనగా చూస్తూ ఉన్నప్పుడు వచ్చే పాట ఇది.   ఇంకా ఆలస్యం ఎందుకు.. మీరు కూడా మధునందన్.. ప్రవీణ్ లతో కలిసి ఏ మాయ చేసిందో అంటూ హమ్ చేయండి!

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?
Tags:    

Similar News