ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ పాన్ ఇండియా లెవల్లో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా మార్కెట్ విస్తరించుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ హీరోలైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదితరులు ఆ వైపుగా అడుగులు వేశారు. రానా దగ్గుబాటి, మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్ట్స్ ప్లాన్స్ చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సైతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలను అన్ని భాషలలో రిలీజ్ చేస్తూ మేమేమీ తక్కువ కాదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పటి వరకు అలాంటి ఆలోచనలు చేయలేదు. టాలీవుడ్ మాలీవుడ్ ల మీద ఫోకస్ పెట్టే బన్నీ ఇప్పుడు మొదటిసారి ఇతర భారతీయ భాషల్లో తన సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఈ క్రమంలో బన్నీ - సుకుమార్ కాంబినేషన్ లో తెరెకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం.
కాగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటించబోయే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లోనే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట. ఈ ఏడాది 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బన్నీ 'పుష్ప' సినిమా తర్వాత ప్రాజెక్ట్ కూడా ఓకే చేశాడట. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ - అల్లు అర్జున్ కాంబోలో మూవీ రాబోతోందట. ఇప్పటికే కొరటాల చెప్పిన స్టోరీ లైన్ బన్నీకి బాగా నచ్చిందని.. ప్రస్తుతం దొరికిన ఈ సమయంలో కొరటాల బన్నీని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులకు ఏం కావాలో సమపాళ్లలో అందించే డైరెక్టర్ కొరటాల తన స్టైల్ లోనే స్ట్రాంగ్ మెసేజ్ ఉండేలా స్టోరీ రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నారట. 'పుష్ప' సినిమా తర్వాత బన్నీ 'పాన్ ఇండియా స్టార్' గా మారుతాడని భావిస్తున్న అల్లు అరవింద్ కొరటాల - బన్నీ కాంబోలో తెరకెక్కబోయే సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించాలని డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట. అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'పుష్ప' మరియు వేణు శ్రీరామ్ 'ఐకాన్' సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందట. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మొత్తం మీద బన్నీ కూడా 'పాన్ ఇండియా స్టార్'గా మారిపోవడానికి ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాడన్నమాట.