ట్రిపుల్ ఆర్ లో న‌టించిన మ‌ల్లి ఎవ‌రో తెలుసా?

Update: 2022-03-30 06:35 GMT
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ 'ట్రిపుల్ ఆర్‌'. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీగ‌త కొంత కాలంగా వాయిదా ప‌డుతూ ఎట్ట‌కేల‌కు మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రిలీజ్ అయిన రోజు తొలి షో నుంచే ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనే టాక్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌రుస రికార్డుల్ని తిర‌గ‌రాస్తూ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టిస్తోంది.

ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం గానూ, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో మెరిసారు. వెండితెర‌పై ఒక‌రిని మించి ఒక‌రు త‌మ పాత్ర‌ల‌తో పోటీప‌డ‌టం ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేస్తోంది.

కొముర భీం పాత్ర‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడంటే ... రామ‌రాజు పాత్ర‌లో గంభీరంగా క‌నిపించి రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టాడ‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ స‌రికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే ట్రిపుల్ ఆర్ చిత్రం ప్ర‌ధానంగా మ‌ల్లి అనే ఓ పాప క‌థ‌తో మొద‌ల‌వుతుంది. మ‌ల్లి మెహెందీ పెట్టిన తీరు న‌చ్చ‌డంతో గ‌వ‌ర్న‌ర్ స్కాట్ వైఫ్ పాప‌ని త‌న‌తో బానిస‌గా తీసుకెళుతుంది. త‌న‌ని విడిపించ‌డానికే ఎన్టీఆర్ పాత్ర రంగంలోకి దిగుతుంది. సినిమాకు కీల‌కంగా నిలిచిన ఈ మ‌ల్లి పాత్ర‌లో న‌టించిన పాప త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంద‌ని, పాత్ర చిన్న‌దే అయినా హీరోల‌తో సామ‌న ప్రాధాన్య‌త వున్న పాత్ర కావ‌డంతో ఈ పాత్ర‌లో న‌టించిన పాప ఎవ‌ర‌నే చ‌ర్చ ప్ర‌స్తుతం మొద‌లైంది. మ‌ల్లి పాత్ర‌లో న‌టించిన పాప పేరు ట్వింకిల్ శ‌ర్మ‌.

చండీఘ‌ర్ రాష్ట్రానికి చెందిన ఈ చిన్నారి డాన్స్ ఇండియా డ్యాన్స్ అనే రియాలిటీ షోతో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ప‌లు టీవీ క‌మ‌ర్షియ‌ల్స్ లోనూ క‌నిపించి పాపుల‌ర్ అయింది. ఫ్లిప్ కార్ట్ యాడ్ లో ఈ చిన్నారిని చూసిన రాజ‌మౌళి మ‌ల్లి పాత్ర‌కు త‌న‌యితే బెస్ట్ అని ఫిక్సయ్యాడ‌ట‌.

అలా ఈ పాప‌ని రాజ‌మౌళి మ‌ల్లి పాత్ర‌కు ఫైన‌ల్ చేసుకున్నాడ‌ని తెలిసింది.సినిమాలో పాప పాడే పాట‌.. ఎన్టీఆర్ తో 'అన్నా న‌న్ను ఈడ ఇడిసిపోక‌న్నా.. అమ్మ యాదికొస్తాంది.. అంటూ చెప్పే డైలాగ్ లు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి.
Tags:    

Similar News