గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. ఇటీవల ఓ ఆసక్తికరమైన పోస్టుతో తిరిగి వచ్చింది. తన పెట్ డాగ్ ఫొటోను షేర్ చేస్తూ 'వెనక్కి తగ్గా కానీ.. ఓడిపోలేదు' అని క్యాప్షన్ పెట్టింది. సామ్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తన బలాన్ని కోల్పోలేదని పరోక్షంగా సూచించిందని అందరూ భావించారు. అయితే ఇప్పుడు తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
ఈరోజు మంగళవారం ఉదయం సమంత తన ఫేస్ కనిపించకుండా.. తను ధరించిన టీ-షర్టు మాత్రమే కనిపించే ఫొటోని షేర్ చేస్తూ.. ''ఒకవేళ మీరు దీన్ని కూడా వినవలసి వస్తే.. మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవరు" అని పోస్ట్ చేసింది. దీనికి రెడ్ హార్ట్ ఎమోజీని జత చేసింది. ఆమె టీ షర్ట్ పై 'యు విల్ నెవర్ వాక్ అలోన్' (మీరు ఎప్పటికీ ఒంటరిగా నడవలేరు) అనే క్యాప్షన్ ముద్రించబడి ఉండటాన్ని గమనించవచ్చు.
ఇది సాధారణ పోస్ట్ లాగా ఉన్నప్పటికీ.. ఇందులో పరోక్ష సందేశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత, తన అనారోగ్యం నుండి కోలుకోవడానికి.. తిరిగి పనిలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోందని.. తాను బలంగా ఉన్నానని.. సపోర్ట్ సిస్టమ్ కూడా ఉందని స్పష్టం చేస్తోందని అంటున్నారు.
సామ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పై పలువురు సెలబ్రిటీలు - స్నేహితులు మరియు అభిమానులు స్పందిస్తున్నారు. మోర్ పవర్ టు యూ.. బీ స్ట్రాంగ్ అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో సానుకూల సందేశాలను పోస్ట్ చేస్తున్నారు. నిఘాడ సందేశాన్ని ఇచ్చే సమంత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంత.. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ - ట్విటర్ లలో ఎక్కువగా కనిపించడం లేదు. రెగ్యులర్ గా పర్సనల్ విషయాలకు సంబంధించిన అప్డేట్స్ - ఫోటోలు షేర్ చేసే అగ్ర నటి.. దాదాపు నాలుగు నెలలపాటు సైలెంట్ అయిపోయింది. కేవలం సినిమాలు - తన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న వాణిజ్య ప్రకటనలను మాత్రమే షేర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ పోస్టులతో నెట్టింట సందడి మొదలు పెడుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. సమంత నటించిన 'యశోద' మరియు 'శాకుంతలం' వంటి పాన్ ఇండియా చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి. మరోవైపు వరుణ్ దావన్ తో కలసి 'సిటాడెల్ ఇండియా' వెబ్ సిరీస్ లో నటించనుంది. రాబోయే ఆయుష్మాన్ ఖురానా - అక్షయ్ కుమార్ వంటి హీరోలతో వర్క్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. 'అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్' అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సామ్ చేతిలో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.