ప్రతీ దర్శకుడికి స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాలని, బిగ్ స్టార్స్ తో సినిమాలు తెరకెక్కించాలనే కోరిక కెరీర్ ప్రారంభం నుంచి వుంటుంది. అలాంటి అవకాశం తమని వెతుక్కుంటూ రావాలని కలలు కంటూ వుంటారు.అలాంటి అవకాశం వస్తే తామేంటో నిరూపిస్తామని భావిస్తుంటారు. ఇప్పడు అలాంటి అవకాశమే యంగ్, అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటిని వెతుక్కుంటూ వచ్చేసిందా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. దర్శకుడు చందూ మొండేటి రూపొందించిన లేటెస్ట్ మూవీ `కార్తికేయ 2`. 2014లో తను రూపొందించిన `కార్తికేయ`కు సీక్వెల్ గా ఈ మూవీని చందూ మొండేటి రూపొందించాడు. నిఖిల్ హీరోగా అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఊహకందని విధంగా కృష్ణ తత్వం వర్కవుట్ కావడంతో ఉత్తరాదిలో ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టి అక్కడి మేకర్స్ ని విస్మయానికి గురిచేసింది.
హిందీ బెల్ట్ లో రూ. 30 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో రూ. 120 కోట్లకు బాక్సాఫీస్ వద్ద మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఉత్తరాదిలో ఎవరికీ తెలియని నిఖిల్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చింది. దీంతో ఈ మూవీని తెరకెక్కించిన దర్శకుడు చందూ మొండేటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ నుంచి చందూ మొండేటికి పిలుపు వచ్చిందట. మంచి కథతో రమ్మని బిగ్ ఆఫర్ ఇచ్చారట.
అలా ఆఫర్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. ఇంతకీ చందూ మొండేటిని ఎవరి కోసం కథ సిద్ధం చేసుకు రమ్మన్నారో తెలుసా.. ఇంకెవరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. `కార్తికేయ 2` ని చందూ మొండేటి తెరకెక్కించిన తీరు ఎంతగానో నచ్చడంతో మంచి కథని అల్లు అర్జున్ కోసం రెడీ చేసి తీసుకురన్నని ఆఫర్ ఇచ్చారట. బన్నీ ప్రస్తుతం `పుష్ప 2` కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఈ మూవీ తరువాత బన్నీ చేయాలనుకున్న `ఐకాన్`ని పక్కన పెట్టేశాడు. కొరటాల శివ తో అనుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఈలోగా `పుష్ప 2` తరువాత మరే డైరెక్టర్ కి బన్నీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చందూ మొండేటికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నుంచి పిలుపు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది. చందూ మొండేటి నెక్స్ట్ లెవెల్ కథతో వెళతాడా? .. ఇద్దరు కలిసి ఎలాంటి కథతో సినిమా చేసే అవకాశం వుందన్నది ఇప్పడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బన్నీని ఇంప్రెస్ చేయగలిగితే చందూ మొండేటి దశ మారినట్టే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.