ఆ యువ హీరోకు కూడా కామన్ డీపీలా?

Update: 2020-03-29 02:30 GMT
అతనో యువ హీరో. రియల్ లైఫ్ లో తన ఓవర్ యాక్టింగ్ తో ఎక్కువగా వార్తల్లో వ్యక్తి అవుతుంటాడు. టాలెంట్ ఉన్నప్పటికీ ఈ అతి ప్రవర్తన కారణంగా యూత్ కు మాత్రమే పరిమితం అవుతున్నాడని.. అతను కనుక పెద్ద స్టార్లను చూసి ఎలా ఒదిగి ఉండాలో నేర్చుకుంటే కెరీర్ లో పైకి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ ఉంది.  ఈమధ్య ఈ యువ హీరోకు ఒక హిట్ కూడా తగిలింది. ఈ హీరో అతి ప్రవర్తన కారణంగానే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కు పోలేదని ట్రేడ్ వర్గాల్లో ఒక అభిప్రాయం ఉంది.

ఇదిలా ఉంటే ఈ హీరో బర్త్ డేకి చేస్తున్న హంగామా మరోసారి చాలామందికి ఓవర్ అనిపిస్తోంది. సోషల్ మీడియా కోసం ఓ కామన్ డీపీ రెడీ చెయ్యడం.. ఆ కామన్ డీపీని మరో యువ హీరో విడుదల చెయ్యడం పెద్ద కార్యక్రమం లాగా చేపట్టారు.  తన డిజిటల్ టీమ్ తో ఆ కామన్ డీపీ ని ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయించాలని ప్లాన్  లో ఉన్నాడట.  ఈమధ్యే ఓ పెద్ద స్టార్ హీరో పుట్టిన రోజు జరిగితే ఇలాంటి హంగామా ఏమీ జరగలేదు.  కామన్ డీపీ లేదు మరోటి లేదు. లక్షల కొద్ది ఫ్యాన్స్.. సూపర్ బ్యాక్ గ్రౌండ్ ఉండే పెద్ద స్టార్ హీరోలే తమ పుట్టిన రోజును నిరాడంబరంగా జరుపుకుంటూ ఉంటే ఈ యువ హీరో హంగామా భరించలేకుండా ఉన్నామని సోషల్ మీడియాలో కూడా సెటైర్లు పడుతున్నాయి.

ఇలాంటి పైపై విషయాలపై కాకుండా నటన మీద.. మంచి స్క్రిప్ట్ లు ఎంచుకోవడం మీద దృష్టి పెడితే ఫ్యాన్ ఫాలోయింగులు..కామన్ డీపీలు గట్రా వాటంతట అవే వస్తాయని ఈ యువ హీరో గుర్తిస్తే అతని కెరీర్ కే మంచిదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  మరి ఈ మాటలు వినిపించుకుంటాడో లేక నాలుగు రోజులు ఆగి  వచ్చే బర్త్ కి "#360 డేస్  కౌంట్ డౌన్" అంటూ కొత్త హంగామా మొదలు పెడతాడో వేచి చూడాలి.


Tags:    

Similar News