తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'డాన్'. మే 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాన్ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ మూవీగా ఉందంటూ పాజిటివ్ రివ్యూలను దక్కించుకుంది. సినిమాకు సంబంధించిన వసూళ్లు కూడా భారీగా నమోదు అయ్యాయి అంటూ తమిళ బాక్సాఫీస్ వర్గాల నుండి టాక్ వచ్చింది.
శివ కార్తికేయన్ కు తెలుగు లో కూడా మంచి ఇమేజ్ ఉండటంతో ఇక్కడ కూడా డబ్ అయ్యింది. అక్కడ ఇక్కడ అంతా కలిపి వంద కోట్లకు పైగానే డాన్ వసూళ్లు రాబట్టాడు. సినిమా విడుదల అయ్యి మూడు వారాలు అవుతుంది. ఈ సందర్బంగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మద్య కాలంలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్ని కూడా నాలుగు వారాల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఒక సరైన సమయం ను చూసి సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇప్పుడు డాన్ సినిమాను కూడా విడుదల అయిన నాలుగు వారాల తర్వాత అంటే జూన్ 10వ తారీకున స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వారు డాన్ సినిమా ను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగిందట. వారే జూన్ 10 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
వరుణ్ డాక్టర్ తర్వాత వెంటనే డాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్నాడు. డాన్ లో శివ కార్తికేయన్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించాడు. ఇక హీరోయిన్ గా క్యూట్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. సముద్రకని మరియు సూరిలు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.
శివ కార్తికేయన్ ఈమద్య కాలంలో తమిళనాట మంచి స్టార్ డమ్ దక్కించుకున్న హీరోగా నిలిచాడు. ఇదే సమయంలో తెలుగు లో కూడా ఈయనకు మంచి పాపులారిటీ దక్కింది. ఈయన తెలుగు లో అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా చేస్తున్న విషయం తెల్సిందే. తన సినిమాలను తానే స్వయంగా నిర్మించుకోవడంతో పాటు.. ప్రతి సినిమాను కూడా మినిమం ఎంటర్ టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే శివ కార్తికేయన్ కు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు పడుతున్నాయి.