పెంపుడు జంతువులు ప్రాణాలు కోల్పోతే మనుషుల్ని దూరం చేసుకున్నంత బాధపడే వ్యక్తులు చాలామందే ఉంటారు. టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కూడా ఈ కోవకు చెందిన వాడే. అతడికి కుక్కలంటే చాలా ఇష్టం. తన ఇంట్లో రెండంకెల సంఖ్యలో కుక్కలుండటం విశేషం. కొన్ని కుక్కల్ని పెద్ద మొత్తానికి కొని పెంచడమే కాదు.. కొన్ని వీధి కుక్కల్ని కూడా తెచ్చి సాకుతున్నాడు రాజ్ తరుణ్. ఆ మధ్య తాను కుక్కల కిడ్నాపర్ గా నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ప్రమోషన్లలో భాగంగా కుక్కలపై తన ప్రేమ గురించి చాలా విశేషాలు చెప్పాడు రాజ్ తరుణ్. తాను చాలా కుక్కల్ని పెంచుతున్నట్లు వెల్లడించాడు. ఆ కుక్కల్లో ఒకటి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో ఇప్పుడు రాజ్ తరుణ్ చాలా బాధలో ఉన్నట్లు సమాచారం.'
రాజ్ తరుణ్ కు చాలా ఇష్టమైన కుక్కల్లో ఒకటట అది. అనారోగ్యం బారిన ఈ కుక్కకు చికిత్స చేయించేందుకు రాజ్ బాగానే ఖర్చు చేశాడట. రూ.2 లక్షల దాకా వెచ్చించాడట. ఆ కుక్కు సర్జరీ కూడా చేయించినట్లు సమాచారం. అయినా అది బతకలేదు. దీంతో మూడు రోజులుగా రాజ్ తరుణ్ విషాదంలో ఉన్నాడట. తన మిత్రుల దగ్గర ఈ కుక్క గురించి చెప్పుకుని బాధపడుతున్నట్లు తెలిసింది. రాజ్ తరుణ్ కు కుక్కలంటే ఎంత ప్రేమో ఈ ఘటనతో అందరికీ తెలిసొచ్చిందట. ఇక రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘రాజు గాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. అనిల్ సుంకర నిర్మాత. అమైరా దస్తూర్ ఈ చిత్రంలో రాజ్ కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది.