పెళ్ళి త్వరలో అంటున్న రాజ్ తరుణ్!

Update: 2019-05-29 06:16 GMT
యంగ్ హీరో రాజ్ తరుణ్ మొదట్లో వరస విజయాలతో దుమ్ము లేపాడు కానీ ఈమధ్య పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు.  లాస్ట్ సినిమా 'లవర్' మరీ నిరాశపరచడంతో సినిమాల నుండి కొన్ని నెలలు గ్యాప్ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ దిల్ రాజు బ్యానర్లో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజగా రాజ్ తరుణ్ ట్విటర్ లో తన అభిమానులతో ముచ్చటించాడు.  వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

ఒక నెటిజన్ "మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్డ్ మ్యారేజా? అని ప్రశ్నిస్తే 'లవ్ మ్యారేజ్' అని చెప్పాడు.  మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు అని అడిగితే "త్వరలో" అన్నాడు.  "మీరు లవ్ మ్యారేజ్ అన్నారు కదా.. ఎప్పుడు మీ రాణిని ఇంట్రడ్యూస్ చేస్తారు?" అని అడిగితే "త్వరలో" అన్నాడు. దీంతో రాజ్ తరుణ్ తన పెళ్ళి విషయంలో క్లారిటీ ఇచ్చినట్టయింది.  గతంలో ఒక హీరోయిన్ తో రాజ్ తరుణ్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని గుసగుసలు విన్పించాయి.  కానీ అప్పట్లోనే అవన్నీ రూమర్లని ఖండించాడు రాజ్ తరుణ్. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ ను క్లీన్ బౌల్డ్ చేసిన ఆ అమ్మాయి ఎవరో?

రాజ్ తరుణ్ చాట్ అంతా పెళ్ళి అనుకునేరు. అలా ఏం లేదు. అభిమానులు వేరే ప్రశ్నలు కూడా అడిగారు.  మీకు ఇష్టమైన హాలీవుడ్ సినిమాల సినిమాల పేర్లు చెప్పమంటే "ఫారెస్ట్ గంప్.. ఇన్ టు ది వైల్డ్.. అక్టోబర్ స్కై" అని సమాధానం ఇచ్చాడు.  తెలుగు లో ఫేవరేట్ ఫిలిం 'ఒక్కడు' అని.. ఫేవరెట్ స్టార్ మహేష్ బాబు అని చెప్పాడు.  మీ సినిమాల్లో తెలుగు హీరోయిన్ ను తీసుకోవచ్చు కదా అని అడిగితే "అది టీమ్ ఛాయిస్. నాది కాదు" అన్నాడు. మీకు ఇష్టమైన వంట ఏదని అడిగితే "చింతపండు పులిహోర"' అన్నాడ. సినీ జీవితంలో హీరోగా కాకుండా చేయాలనుకునే రోల్ ఏంటి అని అడిగితే "డైరెక్టర్" అన్నాడు.  


Tags:    

Similar News