మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిన్న బైక్ యాక్సిడెంట్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నాడు. మెగా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని ఎక్కువ రోజులే తేజూ ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పటికి ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని మెగా అభిమానులకు తాను క్షేమంగానే ఉన్నట్లుగా ఒక థంబ్ చూపించి ఊరటనిచ్చాడు. మెగా హీరో ఆసుపత్రిలో ఉండగానే యంగ్ హీరో రామ్ కూడా గాయ పడ్డాడు. లింగు స్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమా షూటింగ్ లో రామ్ పాల్గొంటున్నాడు. ఆ సమయంలోనే రామ్ కు చిన్న గాయం అయ్యింది. మెడపై తలిగిన గాయంతో అతడు ఇబ్బంది పడ్డాడు. ఆసుపత్రిలో అతడికి మెడ పట్టి ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే అతడి పూర్తిగా కోలుకుని రెండూ ముడు వారాల్లోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఆ ఇద్దరు హీరోలు మాత్రమే కాకుండా ఇంకా పలువురు యంగ్ హీరోలు కూడా ఆసుపత్రిల చుట్టు తిరగాల్సి వస్తుంది. ఆమద్య మహాసముద్రం షూటింగ్ సమయంలో సిద్దార్థ్ కు గాయాలు అయ్యాయి. ఇక్కడ చికిత్స జరిగిన తర్వాత మెరుగైన వైధ్యం కోసం అతడు అమెరికా వెళ్లాడు. అక్కడ సిద్దుకు శస్త్ర చికిత్స చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఆయన తిరిగి వచ్చాడు. మహాసముద్రం విడుదల ప్రమోషన్స్ లో కూడా పాల్గొనేందుకు సిద్దం అన్నట్లుగా సమాచారం అందుతోంది. మహా సముద్రం సినిమాలో శర్వానంద్ తో కలిసి సిద్దు నటించాడు. చాలా రోజుల తర్వాత ఒక డైరెక్ట్ తెలుగు సినిమా తో సిద్దు టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది ఆయనకు ఒక మంచి కమ్ బ్యాక్ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల యంగ్ అండ్ మల్టీ ట్యాలెంటెడ్ హీరో అడవి శేషు కూడా ఆసుపత్రి పాలయ్యాడు. డెంగ్యూ ఫీవర్ తో ప్లేట్ లేట్స్ దారుణంగా పడిపోవడంతో ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యాడు. ఆయన చికిత్స కోసం వారాలకు వారాలు ఆసుపత్రిలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. మానసికంగా మరియు శారీరకంగా కూడా చాలా స్ట్రాంగ్ అయిన అడవి శేషు మళ్లీ సాదారణ స్తితికి వచ్చేశాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడటంతో షూట్ లో పాల్గొంటున్నాడు. ట్యాలెంటెడ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న అడవి శేషు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఆయన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తాయని సమాచారం అందుతోంది. ఇలా ఈమద్య కాలంలో యంగ్ హీరోలు ఆసుపత్రుల చుట్టు తిరగాల్సి రావడం టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త కలవర పాటుకు గురి చేస్తోంది. మళ్లీ ఏ హీరో కూడా ఆసుపత్రి మొహం చూడవద్దు అంటూ అభిమానులు ఆశిస్తున్నారు.