అవును.. కొవిడ్ 19 దెబ్బకు 60 ప్లస్ లో ఉన్నోళ్లు ఔట్. వృద్ధులు చిన్న పిల్లలు బయట తిరగకూడదు. షూటింగుల్లోనూ పాల్గొనకూడదనేది రూల్. ప్రభుత్వాలు ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉండాలని మార్గదర్శకాల్ని ప్రకటించాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం మన వెటరన్ హీరోలంతా 60 ఏజ్ లోనూ టీనేజీ భామలతో ఆటాపాటా అంటూ రెడీ అయిపోతున్నారు.
మన వెటరన్స్ దూకుడు చూస్తుంటే ఇంకా వయసు అయిపోలేదా? అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయ్. గతేడాది కింగ్ నాగార్జున షష్ఠిపూర్తి జరుపుకున్నారు. అంతకు ముందే మెగాస్టార్ చిరంజీవి షష్ఠిపూర్తి ఘనంగా జరిగింది. విక్టరీ వెంకటేష్ వచ్చే ఏడాది షష్టిపూర్తికి రెడీ అవుతున్నారు. ఈనెల 10న బాలకృష్ణ షష్ఠిపూర్తి సెలబ్రేషన్ (బర్త్ డే) కోసం రెడీ అవుతున్నారు. అంటే వీళ్లంతా బార్డర్ క్రాస్ చేసినట్టే. కొవిడ్ నిబంధనల ప్రకారం సెట్స్ కెళ్లేందుకు అనర్హులు. కానీ సన్నివేశం మాత్రం వేరేగా ఉంది. ఎక్కడో లాజిక్ మిస్సయ్యి తేడా కొడుతోంది కదూ! అంటూ వాడి వేడిగా మాట్లాడుకుంటున్నారంతా.
సీనియర్లూ... అస్సలు సింక్ కుదిరిందా సాబ్? లాజిక్ మిస్సవ్వలేదూ? అయినా ఇంకా ఎందుకు ఉబలాటం? 60ఏళ్లు దాటితే సెట్స్ కి వెళ్లకూడదన్న నియమాన్ని పాటించాలి కదా? ప్రభుత్వాల్ని కన్విన్స్ చేసి పరిశ్రమల్ని రన్ చేయడానికి ప్రయత్నించడం వరకూ ఓకే కానీ.. ఇక ఇక్కడితో ఆపేస్తేనే బెటర్.
సీఎంలతో మీటింగులకు వెళ్లేది 60వయసు వాళ్లే. ఏమిటిది సారూ? లాజిక్కులు వెతికితే కష్టమే సుమీ. అయినా దాసరి తర్వాత పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి సైతం ఇకపై వారసుల్ని బరిలో దించితేనే బావుంటుందేమో! రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఎవరో ఒకరిని. మహేష్- ప్రభాస్ - ఎన్టీఆర్ .. వీళ్లంతా ఇక పెద్దన్నల పాత్ర పోషిస్తేనే బావుంటుందేమో.. ఇకపై కష్టకాలంలో పెద్దరికాల్ని వారసులకు బదలాయిస్తేనే బెటరేమో!!