బాలీవుడ్ లోని స్టార్ కిడ్స్ హవా సాగుతోంది. నిండా పాతిక అయినా నిండని నవయవ్వన తారకలు రంగుల ప్రపంచంలో తమను తాము ఆవిష్కరించుకుంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. కేవలం సినీఆరంగేట్రం చేసిన ఒకట్రెండు సంవత్సరాల్లోనే కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. నేటితరం యువనటీనటులలో పలువురు యువనటీనటులు చక్కని అభిరుచితో అద్భుత స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్నారు. తమ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించాయనే దాన్ని బట్టి విశ్లేషించుకుని కెరీర్ బండిని విజయాల బాట వైపు నడిపిస్తున్నారు. అంతేకాదు.. ఆర్జనలోను తగ్గేదేలే! అంటూ భారీ పారితోషికాలు అందుకోవడంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పలువురు నటవారసులు తమ పారితోషికాన్ని అమాంతం పెంచేశారని తెలిసింది.
అంతేకాదు సదరు యువ కథానాయికలకు పొరుగు పరిశ్రమల్లోనూ మంచి డిమాండ్ ఉంది. వీరిలో కొందరికి తెలుగు- తమిళ చిత్ర పరిశ్రమల నుంచి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయితే ఈ భామలు ఒక్కో సినిమాకు ఎంత వసూలు చేస్తున్నారో తెలిస్తే షాక్ తినాల్సిందే.
అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ `ధడక్` సినిమాతో తెరపైకి అడుగుపెట్టింది. జాన్వీ నటిగా ఒక్కో సినిమాతో మెరుగవుతూ అద్భుత నటి అని నిరూపిస్తోంది. ఇరుగు పొరుగు పరిశ్రమలలోను జాన్వీ పేరు మార్మోగుతోంది. త్వరలోనే ఈ బ్యూటీ ప్రముఖ పాన్ ఇండియా స్టార్ సరసన టాలీవుడ్ ఆరంగేట్రం చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ముంబై మీడియా కథనాల ప్రకారం.. జాన్వి ఒక్కో చిత్రానికి రూ. 3-6 కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. బ్రాండ్ ఎండార్స్ మెంట్ ల కోసం రూ. 50-60 లక్షలు తీసుకుంటుంది. జాన్వీ నికర సంపాదన విలువ దాదాపు 66 కోట్లు.
విజయ్ దేవరకొండ లైగర్ తో టాలీవుడ్ ఆరంగేట్రం చేసిన అనన్య పాండే బాలీవుడ్ లో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఒక్కో సినిమాకి 3-4 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం. పాండే నికర సంపదల విలువ రూ. 35-45 కోట్లు.
పటౌడీ సంస్థానంలో వందల కోట్ల ఆస్తులు కలిగి ఉన్న సారా అలీ ఖాన్ అత్యంత డిమాండ్ ఉన్న యువకథానాయికగా పాపులరైంది. జాన్వీ.. అనన్యల కంటే ఎక్కువ పారితోషికం అందుకుంటోంది. రూ. 5-7 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సారా నికర సంపాదన విలువ రూ.40-50 కోట్లు. రూల్స్ ని బ్రేక్ చేస్తూ నిరంతరం సోషల్ మీడియాల్లో వరుస ఫోటోషూట్లతో విరుచుకుపడుతున్న ఈ భామల మంత్రాంగం పెద్ద ఎత్తున ఫలిస్తోంది. సదరు భామలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ అదనంగా భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. ఒక సౌత్ అగ్ర కథానాయికను మించి బాలీవుడ్ యువనాయికలు పారితోషికాలు అందుకోవడం విశేషం. మునుముందు ఈ భామలు టాలీవుడ్ లో ప్రవేశిస్తే ఇక్కడా ఒక్కో సినిమాకు రూ.3-4 కోట్లు పైగానే డిమాండ్ చేసేందుకు ఆస్కారం ఉంది. కానీ అంత పెద్ద మొత్తాలను ఇవ్వాలంటే అగ్ర హీరోలు పెద్ద బ్యానర్లకు మాత్రమే పాజిబుల్ అన్న చర్చా సాగుతోంది.
యువహీరోలు తగ్గేదేలే..!
తెలుగు సినిమా ఆర్.ఎక్స్ 100 రీమేక్ `తడప్`తో అరంగేట్రం చేసిన అహన్ శెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం 80-90 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నాడు. అతడి నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 28-32 కోట్లు.
షాహిద్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ ఒక్కో సినిమాకు దాదాపు 60-80 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. షాహిద్ కపూర్ సోదరుడైన ఈ యువకుడు జాన్వీ కపూర్‌తో కలిసి ధడక్‌తో అరంగేట్రం చేశాడు. అతని నికర విలువ దాదాపు 11-15 కోట్ల రూపాయలు. కార్తీక్ ఆర్యన్.. వరుణ్ ధావన్ సహా చాలా మంది యువహీరోలు అత్యంత భారీ పారితోషికాలు అందుకుంటూ పరిశ్రమలో దూసుకుపోతున్నారు.