సినిమాల ప్రభావం సమాజం మీద ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాషన్ మొదలు.. ఫైటింగ్ వరకూ సినిమాలు చూపించే ప్రభావం అంతా ఇంతాకాదు. సినిమాల్లో ఫ్యాషన్ ఎంతగా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ.. ఫైటింగ్ విషయంలో కూడా అని సందేహపడే వాళ్లుంటారు.
కానీ.. తెలుగు సినిమా దశ.. దిశను మార్చేసిన శివ సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో.. వీధిపోరాటాల్లో వచ్చిన మార్పు చూసి.. అప్పటి పోలీసు అధికారులు విపరీతమైన ఆందోళన చెందే వారు. అలా ఫ్యాషనే కాదు..సినిమాల్లో ఫైటింగ్ కూడా సమాజం మీద చూపించే ప్రభావం చాలానే ఉంటుంది. తాజాగా.. హీరో సాహసాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ముప్పు తప్పని తాజా ఉదంతం చెబుతుంది.
బాహుబలి సినిమాలో ఎత్తైన కొండ కొన అంచుకు చేరే పనిలో భాగంగా.. శివుడి (ప్రభాస్) పాత్ర.. ఆ కొండ నుంచి ఈ కొండకు దూకినట్లుగా చూపించటం తెలిసిందే. ఈ సీన్ చూసి ఉత్తేజం పొందాడో ఏమో కానీ.. అలాంటి ప్రయత్నమే చేసిన ఓ యువకుడు తాజాగా ప్రాణాలు కోల్పోయిన దారుణం తాజాగా చోటు చేసుకుంది.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండెం మండలం ఎలుకలపల్లి గ్రామానికి చెందిన షబ్బీర్ అనే 23 ఏళ్ల కుర్రాడు.. తన ఫ్రెండ్స్ కలిసి పెద్దపల్లి మండలం గట్టు సింగారం జలపాతాలు చూసేందుకు వెళ్లాడు. ఈ టైంలో స్నేహతుల మాటల ప్రభావమో.. బాహుబలి సినిమా ప్రభావమో కానీ.. వీరోచిత ప్రదర్శనలు చేసే ప్రయత్నం చేశాడు. కొండ మీద ఫీట్లు చేస్తూ కిందపడి.. చనిపోయాడు. కొండ మీద నుంచి పడిపోయిన ఇతగాడు ఘటనాస్థలంలోనే మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకే.. రీల్ లైఫ్ వేరు.. రియల్ లైఫ్ వేరని.. రెండింటి మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందన్న చేదు నిజాన్ని అందరూ గుర్తుంచుకోవటం మంచిది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. కన్నవారు.. నమ్ముకున్న వారికి తీరని శోకం మిగలటం ఖాయం.