చాలా రోజుల నుండి రొమాంటిక్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న నాగ చైతన్య.. ఇప్పుడు కృష్ణ మరిముత్తు అనే కొత్త దర్శకుడి డైరక్షన్లో ఒక యాక్షన్ ఎంటర్టయినర్ ను టచ్చేస్తున్నాడు. అదే ''యుద్దం శరణం'' సినిమా. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాతో.. అటు ప్రొడ్యూసర్ కే కాదు ఇటు హీరోకు కూడా ఈ జానర్లో అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం పదండి.
ఆనందంగా సాగే జీవితంలోకి ఏదన్నా డిస్ర్టబెన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే కథతో నాగ చైతన్య యుద్దం శరణం అంటున్నాడు. హ్యాపీగా తన తండ్రి.. తల్లి.. ప్రియురాలు.. అంటూ సాగిపోతున్న జీవితంలోకి.. సడన్ గా ఒక క్రూరమైన విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఆ యువకుడు.. ''పరిగెత్తుతున్న ప్రతీ ఒక్కడు పారిపోతున్నట్లు కాదు'' అంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చి.. స్కెచ్ వేసి ఆ దుండగుల ఆట కట్టించడమే కథ. చూస్తుంటే కొత్త కుర్రాడు కృష్ణ సినిమాను బాగా పటిష్టంగానే రూపొందించాడని అనిపిస్తోంది. ఇక రావు రమేష్, రేవతి, లావణ్య త్రిపాఠి, ప్రియదర్శి వంటి క్యాస్ట్ అంతా సినిమాకు అదనంగా బరువును తెస్తున్నారులే.
ఇక హీరోగా చైతన్య కంటే.. విలన్ గా శ్రీకాంత్ కాసినన్ని ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడు. ఎంతైనా సీనియార్టీ కదా. అలాగే విజువల్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. ఎంతైనా ఈ ప్రొడ్యూసర్ ఖర్చుకు వెనకాడడు కదా. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎంతైనా పెళ్ళిచూపులు సినిమా కంపోజర్ వివేక్ సాగర్ కదా. అలాగే నాని జెంటిల్మన్ సినిమాకు కథ అందించిన డేవిడ్ నాథన్ ఈ సినిమాకు కూడా ఒక థ్రిల్లర్ కథను అందించాడు. చూద్దాం మరి సెప్టెంబర్ 8న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తుందిలే.
Full View