ముదురు క్రికెటర్.. బాలీవుడ్ భామ ప్రేమలో

Update: 2016-12-10 11:04 GMT
ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహించిన ముందు తరం క్రికెటర్లందరూ పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఈ తరం ఆటగాళ్లలో కోహ్లి మాత్రమే బ్యాచిలర్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ.. రహానె.. అశ్విన్.. పుజారా.. వీళ్లందరూ ఓ ఇంటివాళ్లు అయిపోయారు. కానీ 38 ఏళ్లు వచ్చేసిన జహీర్ ఖాన్ మాత్రం ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు. చాలా ఏళ్లు పెళ్లి వాయిదా వేసిన యువరాజ్ సింగ్.. హర్భజన్ సింగ్ కూడా ఈ మధ్యే తమ జోడీల్ని వెతుక్కోగా.. జహీర్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయాడు. గతంలో ఇషా శర్వాణి అనే బాలీవుడ్ భామతో ప్రేమాయణం నడిపిన జహీర్.. ఆమెతో బ్రేకప్ అయ్యాడు.

ఆ తర్వాత జహీర్ ఒంటరిగానే కనిపిస్తుండటంతో ఇక అతను పెళ్లి గిల్లీ చేసుకోకుండా ఉండిపోతాడేమో అనుకున్నారంతా. ఐతే ఈ మధ్య జహీర్ జీవితంలోకి కొత్తమ్మాయి వచ్చేసింది. షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘చక్‌ దే ఇండియా’లో నటించిన బెంగాలీ నటి సాగరికా ఘట్గేతో జహీర్ తాజాగా ఎఫైర్ సాగిస్తున్నాడు. జహీర్‌.. సాగిరక ప్రేమలోతుల్లో బాగా మునిగిపోయారట. వీళ్లిద్దరూ జంటగా యువరాజ్‌ పెళ్లి వేడుకకు కూడా హాజరై కనువిందు చేశారు. యువీకి వివాహ శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.. నెక్ట్స్‌ జహీరే అంటూ ట్వీట్ కూడా చేయడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్ బై చెప్పేశాక కానీ జహీర్ కు పెళ్లి చేసుకునే ఆలోచన రాలేదేమో. గత ఏడాదే అతను రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News