మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన మూవీ బ్రహ్మోత్సవం. సెట్స్ పై ఉన్నపుడు బోలెడన్ని అంచనాలు ఉన్న ఈ చిత్రం.. తీరా థియేటర్లలోకి వచ్చేసరికి దారుణమైన రిజల్ట్ ను ఎదుర్కుంది. మహేష్ బాబు కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ కే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించేసుకుంది.
అయితే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కాంబినేషన్ కావడంతో.. రిలీజ్ కి ముందు భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే 10 కోట్ల రూపాయలు చెల్లించుకుని మరీ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేసింది జీ టీవీ. ఇది రిలీజ్ కి ముందు జరిగిన డీల్. కానీ సినిమా బోల్తా కొట్టేయడంతో.. టీఆర్పీలు కూడా దారుణంగా వస్తున్నాయి. నిజానికి ఖలేజా లాంటి మహేష్ ఫ్లాప్ సినిమాలకు కూడా టీవీల్లో టీఆర్పీ రేటింగ్ విపరీతంగా ఉంటుంది. కానీ బ్రహ్మోత్సవం విషయంలో అది కూడా జరగడం లేదు. టెలికాస్ట్ చేసినప్పుడల్లా ఎదురు నష్టపోవాల్సి వస్తోందట.
అందుకే.. రైట్స్ రిటర్న్ చేసేస్తాం.. ఎంతోకొంత ఇప్పించమని నిర్మాతలను అడుగుతున్నారట జీ టీవీ వర్గాలు. డిమాండ్ లేని సినిమాకి రైట్స్ మళ్లీ వెనక్కి తీసుకుని.. పీవీపీ మాత్రం ఏం చేసుకుంటారు చెప్పండి. అందుకే సైలెంట్ గానే ఉండిపోతున్నట్లు టాక్. బ్రహ్మోత్సవంను కొన్నవాళ్లు అందరికీ నష్టాలనే మిగిలిస్తోందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/