జీ5 'ఏటీఎం': విజేత‌గా నిలిచిన టీజ‌ర్‌

Update: 2023-01-08 04:02 GMT
ఎన్నో సంవ‌త్స‌రాలుగా భారీ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స్టార్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ ఓ మార్పు కోసం ఇప్పుడు ఓటీటీలోకి ప్ర‌వేశించారు. జీ5తో క‌లిసి హ‌రీష్ శంక‌ర్‌, నిర్మాత దిల్‌రాజు `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. హ‌రీష్ శంక‌ర్ `ఏటీఎం` క‌థ‌ను రాయ‌డంతో పాటు షో ర‌న్న‌ర్‌గానూ వ్య‌వ‌హ‌రించారు. ఇవాళ `ఏటీఎం` టీజ‌ర్ విడుద‌లైంది.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లాంటి ప‌వ‌ర్‌ఫుల్ హీరోతో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` తెర‌కెక్కిస్తున్నారు హ‌రీష్ శంక‌ర్‌. ఈ స‌మ‌యంలో ఆయ‌న `ఏటీఎం` అంటూ ఓ థ్రిల్లింగ్ క‌థ‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. న‌లుగురు చిన్న దొంగ‌లు ఉన్న‌ట్టుండి భారీ దోపిడీ చేయాల్సిన ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డితే ఏం చేశారు?  అత్యంత బ‌ల‌వంతుల ప్ర‌భావానికి లోనై వాళ్లు ఆ భారీ దోపిడీ చేశారా?  నేరం చేయ‌డం వ‌ల్ల త‌ల‌కిందులైన‌ జీవితాల‌ను వాళ్లు చ‌క్క‌దిద్దుకోగ‌లిగారా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు ఆగాల్సిందే. జ‌న‌వ‌రి 20న విడుద‌ల కానుంది `ఏటీఎం` వెబ్ సీరీస్‌.

న‌వాబుల్లాంటి జీవితాన్ని గ‌డ‌పాల‌నుకునే హీరో. కానీ ఉండేది స్ల‌మ్‌లో. ఆ ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట‌ప‌డి ధ‌న‌వంతుడు కావాల‌నుకుంటాడు. డ‌బ్బును సంపాదించాల‌నుకునే త‌ప‌న‌తో అత‌ను చేసే ప్ర‌య‌త్నంలో ప‌లువురిని క‌లుస్తుంటాడు. వారిలో ఒక‌డే సుబ్బ‌రాజు.

`ఏటీఎం` వెబ్‌సీరీస్‌లో జ‌గ‌న్ అనే మాస్ రోల్‌లో క‌నిపిస్తారు వీజే స‌న్నీ. క‌థాబ‌లం ఉన్న వెబ్‌సీరీస్ అది. షో ర‌న్న‌ర్ హ‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ ``డ‌బ్బు, దోపిడీ  చుట్టూ తిరిగే క‌థ‌లు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. `ఏటీఎం` కూడా అలాంటి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్ల‌రే. పిల్లికి చెల‌గాటం ఎలుక‌కు ప్రాణ‌సంక‌టం త‌ర‌హా గేమ్‌లో త‌ర్వాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే ఉత్సాహాన్ని ప్రేక్ష‌కుల్లో క‌లిగిస్తుంది`` అని అన్నారు.

నిర్మాత హ‌ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ``ఈ సీరీస్‌లో నైతిక‌త‌, సామాజిక దృక్కోణాలు, అధికారబ‌లం వంటి వాటి గురించి ప్ర‌స్తావించాం. క‌థ‌లో చాలా కోణాలుంటాయి. ప్ర‌తి పాత్రా కొత్త‌గా ఉంటుంది. ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌ని విధంగా అనిపిస్తుంది. `ఏటీఎం` వెబ్‌సీరీస్ కోసం రైట్ ప్లాట్‌ఫార్మ్ గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు, జీ5 వాళ్లు మాతో క‌లిశారు`` అని అన్నారు.

కృష్ణ‌, ర‌విరాజ్‌, రోయిల్ శ్రీ, పృథ్వి, దివ్య వాణి, దివి, హ‌ర్షిణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం స‌మకూర్చారు.

"ఏటీఎం" టీజ‌ర్‌ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3ZkWByu


Full View
Tags:    

Similar News