స్టార్ హీరో నుంచి ఆ ఒక్క బుద్ధి కొడుక్కి రాలేదు
కానీ అతడి వారసుడు ఆర్యన్ ఖాన్ తన తండ్రికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. తన క్రమశిఓణతో హెడ్ టర్నర్ గా మారుతున్నాడు.
పరిశ్రమలో ప్రజల్లో అసాధారణ ఛరిష్మాను కలిగి ఉన్న ఆ స్టార్ హీరో క్రమశిక్షణపై విమర్శలున్నాయి. ఎప్పుడూ సెట్స్ కి సమయానికి చేరుకునేవాడు కాదు. దానివల్ల చాలా మంది దర్శకనిర్మాతలు ఇబ్బంది పడ్డారు. కానీ అతడి వారసుడు తన ఆరంగేట్రంలో ఎంతో క్రమశిక్షణతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. తన తండ్రి వారసత్వంగా ఆ ఒక్క ఆస్తిని వదులుకుంటున్నాడని గుసగుస వినిపిస్తోంది. ఇంతకీ ఈ ఎపిసోడ్ లో తండ్రి ఎవరు? కొడుకు ఎవరు? అంటే.. ది గ్రేట్ కింగ్ ఖాన్ షారూఖ్.. అతడి వారసుడు ఆర్యన్ ఖాన్ గురించే ఇదంతా.
షారూఖ్ ఖాన్ తన వృత్తి నైపుణ్యంతో చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడు. అతడు అద్భుతమైన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అతడితో కొన్ని సమస్యలున్నాయి. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు కానీ షారుఖ్ ఖాన్ తన సినిమాల సెట్స్‌పైకి ఆలస్యంగా రావడం విసిగించడంలో పాపులరయ్యాడు. గడిచిన కొన్ని సంవత్సరాలలో చాలా మందిని కలవరపరిచాడు.
కానీ అతడి వారసుడు ఆర్యన్ ఖాన్ తన తండ్రికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. తన క్రమశిఓణతో హెడ్ టర్నర్ గా మారుతున్నాడు. ఆర్యన్ ఇటీవలే తన తండ్రి షారూఖ్, సోదరి సుహానాతో కలిసి ఒక కమర్షియల్ ప్రకటనను రూపొందించాడు. తదుపరి ఈ యువకుడు నెట్‌ఫ్లిక్స్ కోసం తన మొదటి ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో పెద్ద స్టార్ గా పేరు తెచ్చుకున్న ఓ నటుడి జీవితం ఆధారంగా `స్టార్డమ్` అనే వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్ లొకేషన్ ఉండగా ఆర్యన్ గురించి గుసగుసలు ఎక్కువయ్యాయి. అతడు రకరకాల కారణాలతో హెడ్ లైన్స్లోకొస్తున్నాడు. పెద్ద స్టార్ వారసుడు కాబట్టి మీడియా దృష్టి ఎప్పుడూ అతడిపైనే ఉంటోంది. అయితే ఆర్యన్ తన తండ్రిలా కాకుండా ఎప్పుడూ సెట్స్‌లో అందరికీ అందుబాటులో ఉంటాడని ముంబై మీడియాలో కథనాలు వస్తున్నాయి. స్టార్ కిడ్ ఎప్పుడూ వ్యానిటీ వ్యాన్ని ఉపయోగించడు. ప్యాక్ అప్ ప్రకటించే వరకు సెట్స్‌లో కనిపిస్తాడు. ఆర్యన్ గొప్ప వంశం నుండి వచ్చినా కానీ అది బుర్రకెక్కించుకోలేదు. అతడు ఎంతో ఒదిగి ఉంటాడు. అందరినీ గౌరవిస్తాడు.. అందరితో సులువుగా కలిసిపోతాడు! అని పాజిటివిటీ స్ప్రెడ్ అయింది. ఏదేమైనా కింగ్ ఖాన్ వారసుడిపై ఇదంతా పాజిటివ్ వైబ్స్ ని వెదజల్లుతుందనడంలో సందేహం లేదు. తనపై నెగెటివిటీ స్ప్రెడ్ కాకపోతే చాలు.. ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చుకోగలడు.