#WakeUp అంటూ శంక‌ర్ పై ఎటాకింగ్!

ప్రేక్ష‌కాభిమానుల స‌హనాన్ని ప‌రీక్షిస్తే ఎలా ఉంటుందో ఇప్ప‌టికే ఎంతో మంది హీరోలు..ద‌ర్శ‌కులు చూసారు.

Update: 2024-01-31 11:10 GMT

తేడా జ‌రిగితే సోష‌ల్ మీడియాలో ఎవ‌రి సీన్ అయిన సితారైపోతున్న సంగ‌తి తెలిసిందే. ఎంత‌టి వా రైనా..ఎలాంటి వారైనా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. అమితాబ‌చ్చ‌న్..చిరంజీవి లాంటి లెజెండ్స్ సైతం ట్రోలింగ్ బారిన ప‌డిన సంద‌ర్భాలెన్నో. అలాంటి వారిపైనే ట్రోలింగ్ జ‌రిగిందంటే? మిగ‌తా వారు ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంచ‌నా వేయోచ్చు. ప్రేక్ష‌కాభిమానుల స‌హనాన్ని ప‌రీక్షిస్తే ఎలా ఉంటుందో ఇప్ప‌టికే ఎంతో మంది హీరోలు..ద‌ర్శ‌కులు చూసారు.

సినిమా అప్ డేట్స్ ఇవ్వ‌క‌పోయినా..కొత్త సినిమా డిలే అయినా సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు..ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిందే. తాజాగా దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శకుడు శంక‌ర్ పైనా ట్రోలింగ్ షురూ అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా `గేమ్ ఛేంజ‌ర్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా ప్రారంభ‌మైన మూడే ఏడాది ర‌న్నింగ్ లో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ కూడా పూర్తి కాలేదు.

ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియ‌దు. ఇక అప్ డేట్స్ ప‌రంగానూ ఒక‌టి రెండు గ్లింప్స్ వ‌చ్చాయి త‌ప్ప మ‌రో అప్ డేట్ లేదు. ఈ నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రి 14 నుంచి మ‌ళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ప్ర‌చారం మొద‌లైంది. దీంతో `గేమ్ ఛేంజ‌ర్` టాపిక్ మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో మొదలైంది. అయితే షూట్ ప్రారంభం అవుతుంద‌ని నెట్టింట ప్ర‌చారం త‌ప్ప ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు. రెండు పోస్ట‌ర్ల‌తోనే స‌రిపెట్టిన చిత్ర‌బృందం ఇంకేవిష‌యాలు చెప్ప‌ద‌లుచుకోలేదా? అంటూ శంక‌ర్ టార్గెట్ అయ్యాడు.

ఎందుకంటే ఇందులో చ‌ర‌ణ్ -నిర్మాత దిల్ రాజు కి ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ లేదు. షూటింగ్ డిలే అవ్వ‌డానికి కార‌ణం శంక‌ర్ కావ‌డంతోనే అత‌నే ట్రోల‌ర్స్ ఆహారంగా మారిపోయారు. రామ్ చరణ్ అభిమానులు ఎక్స్ లో “బాధ్యతా రహితమైన దర్శకుడు శంకర్” “#WakeUpShankar” ట్రెండింగ్ ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మ‌రి ఇప్పుడైనా గేమ్ ఛేంజ‌ర్ గురించి నోరు విప్పుతారా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News