అయోధ్య.. లేటుగా లీకైన ధనుష్ - మెగా సెల్ఫీ..

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు దివ్య ముహూర్తాన జరిగింది.

Update: 2024-01-23 14:32 GMT

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు దివ్య ముహూర్తాన జరిగింది. నూతన ఆలయ ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందగా.. వారంతా విచ్చేసి కనులారా వీక్షించారు.

అయితే ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం సందడి చేసింది. ఆలయ ప్రారంభోత్సవానికి చిరంజీవికి వీఐపీ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భార్య సురేఖ, కుమారుడు మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ తో కలిసి చిరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఫ్లైట్ లో అయోధ్య కు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకున్నారు.

రామమందిర ప్రాంగణంలో చిరంజీవి, రామ్ చరణ్ పిక్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిజినెస్ మ్యాన్ అనిల్ అంబానీతో చిరు, చరణ్ లు మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు వచ్చింది. తాజాగా మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆ సమయంలో చిరు, చరణ్ లు.. ధనుష్ తో ఓ సెల్ఫీ తీసుకున్నారు. తాజాగా బయటకొచ్చిన ఈ ఫొటోను చూసిన మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అలా ఓ సినిమా కూడా ప్లాన్ చేయెచ్చుగా బాస్ అంటూ రిక్వెస్ట్ లు చేస్తున్నారు.

ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, చరణ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తదితర సినీ పెద్దలు హాజరై వేడుకను స్వయంగా వీక్షించారు. అలాగే సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆతిథ్యాన్ని స్వీకరించారు.

తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ధనుష్.. జనవరి 26వ తేదీన కెప్టెన్ మిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చిరంజీవి.. ప్రెజెంట్ వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.

Tags:    

Similar News