సందీప్.. ఈసారి ఎలాంటి రోల్ ఇస్తాడో?

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2024-09-26 16:30 GMT

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. యానిమల్ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నారో అందరికీ తెలిసిందే. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కోట్లలో లాభాలు ఆర్జించింది. ఓటీటీలో కూడా అదరగొట్టింది. పెద్ద ఎత్తున వ్యూస్ ను దక్కించుకుంది. సినిమాపై పలువురు సెలబ్రిటీలతోపాటు కొందరు ఆడియన్స్ విమర్శలు చేసినా.. డోంట్ కేర్ అన్నట్లు దూసుకెళ్లింది.

అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేయబోయే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ మూవీ వర్క్స్ తో ఇప్పుడు బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగా. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న స్పిరిట్ మూవీకి గాను.. ప్రభాస్ తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోనున్నారు. లాఠీ ఝుళిపించనున్నారు. మూవీలో మునుపెన్నడూ చూడని ప్రభాస్‌ ను చూడనున్నట్లు మేకర్స్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

పాన్‌ ఇండియా స్థాయిలో టీ సిరీస్‌ బ్యానర్‌ పై రూపొందనున్న స్పిరిట్ మూవీ.. రెండేళ్లలో పూర్తి చేస్తానని రీసెంట్ గా ఓ కార్యక్రమంలో సందీప్ వంగా తెలిపారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన లాస్ట్ మూవీ యానిమల్ లో యాక్ట్ చేసిన నటుడు బబ్లూ పృథ్వీరాజ్.. స్పిరిట్ మూవీ కోసం మాట్లాడారు. తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రభాస్ ను స్పిరిట్ లో కొత్త జానర్ లో.. కొత్త గెటప్ లో.. కొత్త అవతార్ లో సందీప్ వంగా చూపించబోతున్నారని తెలిపారు పృథ్వీరాజ్. ప్రభాస్, సందీప్ తో కలిసి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పారు. మేకర్స్ కాల్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అని అన్నారు. దీంతో సందీప్ వంగా.. పృథ్వీరాజ్ ను స్పిరిట్ లోకి కూడా తీసుకుంటారేమోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో మరో విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడకు చెందిన ఎన్నో సినిమాల్లో నటించిన పృథ్వీరాజ్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ యానిమల్ లో చిన్న రోల్ లో మాత్రమే కనిపించారు. యాక్టింగ్ టాలెంట్ ను బయటపెట్టే స్కోప్ ఉన్న పాత్ర ఆయనకు దక్కలేదు. పృథ్వీరాజ్ రోల్ పరిధి చాలా తక్కువేనని చెప్పాలి. దీంతో ఇప్పుడు స్పిరిట్ లో ఆయనకు సందీప్ ఎలాంటి రోల్ ఇస్తారో చూడాలని నెటిజన్లు అంటున్నారు. మరి ప్రభాస్ స్పిరిట్ లో బబ్లూ పృథ్వీరాజ్ నటిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Tags:    

Similar News