ట్రైలర్ తో పుష్ప రాజ్ ప్రెజర్ తగ్గిస్తారా?
బాలీవుడ్ లో `పుష్ప-2` బ్లాస్ట్ అయింది. అనుకున్న అంచనాలన్నీ అక్కడ పుష్ప-2 ప్రూవ్ చేస్తుంది. ఇప్పట్లో పుష్ప రాజ్ వేగాన్ని నార్త్ లో అందుకోవడం చిన్న విషయం కాదు.
బాలీవుడ్ లో `పుష్ప-2` బ్లాస్ట్ అయింది. అనుకున్న అంచనాలన్నీ అక్కడ పుష్ప-2 ప్రూవ్ చేస్తుంది. ఇప్పట్లో పుష్ప రాజ్ వేగాన్ని నార్త్ లో అందుకోవడం చిన్న విషయం కాదు. కొన్ని వారాల పాటు పుష్ప-2 దూకుడుకు అడ్డు కట్ట వేయడం అసాధ్యం. `ఛావా`లాంటి సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవడం ఎంతో కలిసొచ్చిందన్నది ఇప్పుడు అక్కడ గట్టిగా వినిపిస్తోన్న మాట. పుష్ప వేవ్ లో గనుక ఛావా రిలీజ్ అయి ఉంటే? పరిస్థితులు మరోలా ఉండేయన్నది అర్దం అవుతుంది.
అయితే పుష్పరాజ్ వేగానికి కాస్త బ్రేక్ వేడయానికి మాత్రం వరుణ్ ధావన్-కీర్తి సురేష్ నటిస్తోన్న `బేబీ జాన్` మాత్రం డిసెంబర్ 25న రిలీజ్ అవుతుంది. అప్పటికి `పుష్ప-2` కాస్త నెమ్మదిస్తుంది. ఆ కాన్పిడెన్స్ తో `బేబీజాన్` రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు సహా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో `పుష్ప` మేనియా నుంచి నార్త్ ఆడియన్స్ ని డైవర్ట్ చేయడానికి `బేబిజాన్` ట్రైలర్ ని డిసెంబర్ 9న రిలీజ్ చేస్తున్నారు.
ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండాలి. ఈ చిత్రంతో వరుణ్ ధావన్ యాక్షన్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ట్రై చేస్తున్నాడు. అలాగే సినిమాలో కీర్తి సురేష్ నటించడం కూడా ఇక్కడ కలిసొచ్చిన అంశం. వీరిద్దరు క్రేజ్ తోనే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మారాలి. కీర్తికి నార్త్ ఆడియన్స్ కొత్త అయినప్పటికీ అమ్మడు వాళ్లను తెలివిగా బుట్టలో వేయగల నేర్పరి. ఆఫ్ ది స్క్రీన్ తనలో చలాకీతనం కలిసొచ్చే అంశం.
మరి ఇవన్నీ ఇప్పుడు బేబిజాన్ ప్రచారానికి కలిసి రావాలి. ట్రైలర్ రిలీజ్ పుష్ప నుంచి ఉన్న ఒత్తిడిని కాస్త తగ్గించగలగాలి. బాలీవుడ్ నుంచి ఏడాది ముగింపులో రిలీజ్ అవుతున్న చిట్ట చివరి చిత్రం కూడా ఇదే . ఈ నేపథ్యంలో ఆ సినిమా ఏడాదికి సంతోషకరమైన ముగింపును అందించాలి. మరి ఈ ఫేజ్ ని ఎలా దాటుతుందన్నది చూడాలి.