ఫేక్ రికార్డుల మీద బాలయ్య పంచ్..!

ఇక ఇదే క్రమంలో రికార్డుల గురించి బాలకృష్ణ పంచ్ వేశారు. నావి అన్ని ఒరిజినల్ రికార్డులని చెప్పారు బాలయ్య.

Update: 2025-01-23 05:12 GMT

నందమూరి నట సింహం బాలకృష్ణ ఏం మాట్లాడినా డైరెక్ట్ గా పాయింట్ ఏంటన్నది స్పష్టంగా ఉంటుంది. సంక్రాంతి రేసులో డాకు మహారాజ్ తో వచ్చి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎస్ నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేశాడు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సాంగ్స్, బిజిఎం కూడా అదరగొట్టేసింది.

సూపర్ హిట్ అయిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని అనంతపురం లో నిర్వహించారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ ప్లాన్ చేయగా ఆ టైం లో కుదరకపోవడంతో డాకు మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ అక్కడ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య ఎనర్జిటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని మరింత ఉత్సాహ పరచింది. డాకు మహారాజ్ మొదలైన నాటి నుంచి రిలీజ్ వరకు తనతో పాటు సినిమాకు కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావించారు బాలయ్య.

ఇక ఇదే క్రమంలో రికార్డుల గురించి బాలకృష్ణ పంచ్ వేశారు. నావి అన్ని ఒరిజినల్ రికార్డులని చెప్పారు బాలయ్య. అంటే ఈమధ్య పోస్టర్స్ పై ఫేక్ కలెక్షన్ నెంబర్స్ అనేవి చాలా కామన్ అయ్యాయి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే వాటికి సంబంధం లేకుండా కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తున్నారు. వీటిపై నిర్మాతలు అదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్నా కూడా ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు అలా చేస్తున్నారు.

ఐతే బాలకృష్ణ మాత్రం తన రికార్డులన్నీ ఒరిజినల్ అని స్పెషల్ గా మెన్షన్ చేశారు. ఫేక్ కలెక్షన్స్, ఫేక్ రికార్డుల మీద బాలయ్య మార్క్ పంచ్ గా దీన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. డాకు మహారాజ్ సక్సెస్ తో బాలయ్య లో జోష్ రెట్టింపు అయ్యింది. అందుకే ఆయన కొన ఊపిరి వరకు సినిమాలు చేస్తానని.. ఇంకా ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిలో నిలిచే సినిమాలు చేస్తానని అన్నారు.

డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఉంటుందని టాక్. రాబోతున్న సినిమాలతో బాలకృష్ణ టార్గెట్ కూడా భారీగా ఉండబోతుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News