నీ పెళ్లి నా బాధ్యత.. హీరోయిన్ తో బాలయ్య..!

ఐతే ఈ క్రమంలోనే నీ పెళ్లి నేను చేస్తానని శ్రీలీలకు మాటిచ్చారు బాలకృష్ణ. బాలయ్య శ్రీలీల కలిసి భగవంత్ కేసరి సినిమా చేశారు.

Update: 2024-12-07 14:42 GMT

నందమూరి బాలకృష్ణతో పరిచయం అయితే చాలు ఆయన మనసు ఎలాంటిదో అర్థమవుతుంది. తెర మీద యాక్షన్ హీరోగా రక్తపాతం చేసే ఆయన ఆఫ్ స్క్రీన్ చాలా సరదాగా ఉంటారు. ఆయనలోని ఈ యాంగిల్ ని మరింత బయట పెట్టేలా చేసింది ఆహా అన్ స్టాపబుల్. ఆహా లో అన్ స్టపబుల్ షో ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుంచి బాలయ్య క్రేజ్ డబుల్ అయ్యింది. ఇన్నాళ్లు బాలకృష్ణ గురించి ఒక నిర్ణయం ఉన్న అందరు కూడా ఆయన షోలో చేసే కామెడీ, చూపిస్తున్న సెన్సాఫ్ హ్యూమర్ చూసి ఇంప్రెస్ అయ్యారు.

ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 4 లో లేటెస్ట్ ఎపిసోడ్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కి అతిథులుగా నవీన్ పొలిశెట్టి, శ్రీలీల వచ్చారు. ఐతే ఈ స్పెషల్ చిట్ చాట్ లో భాగంగా నవీన్ కు హీరోయిన్స్ ఫోటోలు, శ్రీలీలకు హీరోల ఫోటోలు చూపిస్తూ వారిలో నచ్చిన క్వాలిటీస్ ఏంటో చెప్పమన్నారు. నవీన్ పొలిశెట్టికి సమంత లా ఫిట్ నెస్, అనుష్క లా లక్, రష్మిక స్మైల్ చెప్పాడు.. చివరకు శ్రీలీల ఫోటో వేయగా ఇవన్నీ ఉన్న శ్రీలీల లాంటి అమ్మాయి నాకు ఇష్టమని అన్నాడు.

శ్రీలీలకు మహేష్, అల్లు అర్జున్, నవీన్ పొలిశెట్టి ఫోటోలు ఇవ్వగా మహేష్ కళ్లు ఇష్టమని.. అల్లు అర్జున్ సినిమా కోసం పరితపిస్తారని అన్నది. నవీన్ గురించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అన్నది. ఐతే ఈ క్రమంలోనే నీ పెళ్లి నేను చేస్తానని శ్రీలీలకు మాటిచ్చారు బాలకృష్ణ. బాలయ్య శ్రీలీల కలిసి భగవంత్ కేసరి సినిమా చేశారు. ఆ సినిమాలో విజ్జి పాపగా శ్రీలీల నటించింది. ఆ సినిమా టైం లో ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు.

అందుకే బాలకృష్ణ శ్రీలీల మీద తన అభిమానాన్ని చూపిస్తున్నారు. అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ని సూపర్ ఎంటర్టైన్ చేస్తుంది. నవీన్ పొలిశెట్టి మల్టీ టాలెంట్ గురించి ఇంప్రెస్ అయిన బాలకృష్ణ కెరీర్ లో మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. దాదాపు ఎపిసోడ్ అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. తన కెరీర్ కష్టాలు గురించి చెప్పి నవీన్ పొలిశెట్టి ప్రేక్షకుల హృదయాలను టచ్ చేశాడు.

Tags:    

Similar News