బాలయ్య, వెంకీ ద ఓజీస్ ఆఫ్ తెలుగు సినిమా.. అన్ స్టాపబుల్ ప్రోమో..!

ఈ ప్రోమో చూస్తుంటేనే ఎపిసోడ్ ఎప్పుడు చూసేయాలా అన్నట్టుగా ఉంది.

Update: 2024-12-24 06:02 GMT

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ షోకి లేటేస్ట్ గా మన విక్టరీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. మామూలుగా రియాలిటీ షోస్ లో తక్కువ పాల్గొనే వెంకటేష్ అన్ స్టాపబుల్ షోకి రావడం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. వెంకటేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమో చూస్తుంటేనే ఎపిసోడ్ ఎప్పుడు చూసేయాలా అన్నట్టుగా ఉంది. విక్టరీ వెంకటేష్ ని ఎంతో ప్రేమతో హుషారుగా పిలిచారు బాలకృష్ణ.

ఇక ఇద్దరు కూడా వారి కెరీర్ మొదటి రోజులను గుర్తు చేసుకున్నారు. మాటల మధ్యలో టాలీవుడ్ నాలుగు స్తంభాలు అంటూ చిరంజీవి, నాగార్జునల పోస్టర్ గురించి కూడా మాట్లాడారు. వెంకటేష్ తో సరదా సంభాషణలతో ఎపిసోడ్ అంతా సూపర్ ఎంటర్టైనర్ గా జరిగినట్టు అనిపిస్తుంది. ఇక ఎపిసోడ్ లో వెంకటేష్ తో పాటు సురేష్ బాబు సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తో పాటు వెంకటేష్ కూడా మూవీ మొఘల్ రామానాయుడు ని గుర్తు చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు.

వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాను డైరెక్ట్ చేసిన అనీల్ రావిపుడి కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ని ఆయన ఎంట్రీతో మరింత జోష్ పెంచింది. బాలయ్య, వెంకీలను ఒక ఐకానిక్ ఫోజు ఇవ్వండని ఇద్దరిని అడిగితే అలా సోఫా లో వెంకటేష్, బాలకృష్ణ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ఇక బాలయ్య కూడా పెళ్లికల వచ్చేసిందే బాలా సాంగ్ కి స్టెప్పులేశారు.

వెంకటేష్ కి కోపం వస్తే ఎలా ఉంటుంది అని సురేష్ బాబుని అడిగారు బాలయ్య. వెంకటేష్ చేయి వెనక్కి పెట్టాడంటే అంతే అన్నట్టు అన్నారు. మొత్తానికి ప్రోమోతోనే ఎపిసోడ్ రేంజ్ ఏంటన్నది అర్థమైంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఈ ఎపిసోడ్ సంథింగ్ స్పెషల్ గా నిలిచేలా ఉంది. బాలకృష్ణతో వెంకటేష్ అన్ స్టాపబుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ ఎపిసోడ్ ఈ నెల 27న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. బాలయ్య ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా వెంకటేష్ ఎనర్జీతో అన్ స్టాపబుల్ ఈ స్పెషల్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కి సూపర్ మస్త్ ఎంటర్టైనింగ్ అందించనుంది. బాలకృష్ణ, వెంకటేష్ ని అలా చూస్తుంటే తెలుగు సినీ అభిమానులకు కన్నుల పండగ అన్నట్టే చెప్పొచ్చు.

Full View
Tags:    

Similar News