బాలయ్య గర్జన.. భగవంత్ కేసరి రూ.100కోట్ల బీభత్సం
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల కలెక్షన్స్ వివరాలు మూవీటీమ్ కూడా అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.
ఆరు పదుల వయసు దాటినా ఏమాత్రం అలసిపోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహాం బాలకృష్ణ. ఇదే ఊపులోనే ఇప్పుడు 'భగవంత్ కేసరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్నారు. పైగా దసరా సెలవలు. ఆడపిల్లల గురించి సోషల్ మెసేజ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడించడం వల్ల.. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్ భారీగా తరలి థియేటర్లకు దూసుకెళ్తున్నారు. దీంతో వసూళ్లు రోజురోజుకు భారీగా వస్తున్నాయి.
సినిమా విడుదలై 6 రోజులు అవుతున్నా వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం దంచవే మేనత్త కూతురా పాట కూడా యాడ్ చేశారు. ఇది ఇంకాస్త ప్లస్ పాయింట్ అయ్యింది. తొలి సారి ఈ పాటను మిస్ చేసుకున్న ఫ్యాన్స్ రెండో సారి ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల కలెక్షన్స్ వివరాలు మూవీటీమ్ కూడా అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. రూ.104కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ తెలిపింది.
నైజాంలో రూ. 12.7 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.9 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.8 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.2.4 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.2.2 కోట్లు, గుంటూరులో రూ. 5.1కోట్లు, కృష్ణాలో రూ. 2.6 కోట్లు, నెల్లూరులో రూ. 1.8 కోట్లు, కర్నాటక రూ.3.8కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 0.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.00 కోట్లతో కలిపి మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఆరు రోజుల్లో రూ.51.8 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఈ భగవంత్ కేసరి.. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చింది. యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించారు. తమన్ అందించిన సంగీతం కూడా బాగా ప్లస్ అయింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు.