బండ్లన్న ఫైర్... ఔను నేను కమెడియన్‌నే
జోకర్, కమెడియన్ అంటూ కొందరు కామెంట్స్ చేయడంతో బండ్ల గణేష్ సీరియస్ గానే స్పందించాడు. బండ్ల వీడియో సందేశం తో మరింతగా సోషల్ మీడియాలో హీట్ రాజుకున్నట్లు అయింది.
నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్వీట్స్ తో సందడి చేస్తూ ఉండే బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరింత హడావిడి చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్ నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. జోకర్, కమెడియన్ అంటూ కొందరు కామెంట్స్ చేయడంతో బండ్ల గణేష్ సీరియస్ గానే స్పందించాడు. బండ్ల వీడియో సందేశం తో మరింతగా సోషల్ మీడియాలో హీట్ రాజుకున్నట్లు అయింది.
బండ్ల గణేష్ తాజాగా రిలీజ్ చేసిన వీడియో లో మాట్లాడుతూ... నేను బతకడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇన్‌స్టిట్యూట్ అయిపోయాక షాద్ నగర్ తిరిగి వెళ్లి పోకుండా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ లో ఆఫీస్ బాయ్ గా పని చేశాను. అక్కడ నుంచి అగ్ర నిర్మాత గా ఎదిగినందుకు చాలా గర్వంగా ఉంది. చిన్న చిన్న వేశాలు వేస్తూ కెరీర్ లో నిలదొక్కుకున్నాను. అంతే తప్ప తాను మేనేజ్మెంట్ కోటాలో ఇండస్ట్రీకి రాలేదు అన్నాడు.
తండ్రి పేరు లేదా సంస్థ పేరును చెప్పుకుని నేను ఎదగలేదు అని కూడా కొందరు రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సొంతంగానే తన ఇమేజ్ ను తాను బిల్డ్ చేసుకున్నాను అన్నాడు.
నాకు నేనుగా బాస్ అయ్యాను.. నేను ఒక రైతుని, శ్రామికుడిని, ఓనర్ ని అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. నేను కమెడియన్ నే... నన్ను కమెడియన్ అన్నందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా బండ్ల గణేష్ వ్యాఖ్యలు చేశాడు. బండ్లన్న ఫైర్ మీద చేసిన వ్యాఖ్యలకు అవతలి వారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.