ఆ బ్యూటీ మ‌న‌సు త‌ట్టింది ఎవ‌ర‌బ్బా?

సొగ‌స‌రి మ్యాక‌ప్ ..నెక్ పై ముత్య‌పు గోలుసు మ‌రింత వ‌న్నె మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చి దిద్దాయి. రూపంలో మార్పులు కొట్టొచ్చిన‌ట్లుంది.

Update: 2023-11-19 02:03 GMT

ఇన్ స్టా క్వీన్ దివి వ‌ద‌త్య టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యూటీ సోషల్ మీడియాలో పిక్ పెట్టిందంటే? అక్క‌డ చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. అంద చందాల‌తో మ‌త్తెక్కించే ఫోట‌ల‌తో కాక‌లు పుట్టిస్తుం ది. న‌టిగా క‌న్నా..ఇన్ స్టాక్వీన్ గా బాగా పాపుల‌ర్ అయింది. ఇప్పుడిప్పుడే న‌టిగానూ బిజీ అవుతోంది. తాజాగా బ్యూటీ మ‌రో ఫోటోతో అంత‌ర్జాలంలోకి వ‌చ్చేసింది.


ఇదిగో ఇక్క‌డిలా డిజైన‌ర్ దుస్తుల్లో సెగ‌లు పుట్టిస్తుంది. మ‌ల్టీ డిజైన్ బాట‌మ్ పై ఎరుపు వ‌ర్ణం బ్లౌజులో అందాల ఆర‌బోత షురూ చేసింది. సొగ‌స‌రి మ్యాక‌ప్ ..నెక్ పై ముత్య‌పు గోలుసు మ‌రింత వ‌న్నె మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా తీర్చి దిద్దాయి. రూపంలో మార్పులు కొట్టొచ్చిన‌ట్లుంది. మునుప‌టి ఫోటోల‌తో పోల్చితే శ‌రీరం స‌హారూప లావ‌ణ్యంలో భారీ మార్పులే క‌నిపిస్తున్నాయి. ఈ ఫోట‌ని ఉద్దేశించి దివి ఓ పోస్ట్ కూడా చేసింది.


`తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు … కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు` అంటూ త‌న‌లో ర‌చ‌యిత్రీని త‌ట్టి లేపింది. అమ్మ‌డి కామెంట్ ని బ‌ట్టి ప్రేమ‌లో ప‌డిందా? అన్న సందేహం రాక‌మాన‌దు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. బ్యూటీ కెరీర్ సంగ‌తి చూస్తే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇన్నాళ్లు పెద్దగా గుర్తింపు రాలేదు.


బిగ్ బాస్ తో అనూహ్యంగా అమ్మడు కి స్టార్ డమ్ వచ్చింది. బిగ్ బాస్ లో ఉన్నది కొన్నాళ్లే అయినా కూడా ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు వస్తున్నాయి. `బిగ్ బాస్` ఫినాలే స్టేజ్ పై దివి అందం గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆమె స్థాయిని పెంచాయి. ఆ ప్ర‌శంస‌లు అవ‌కాశాల‌కు దారి తీసాయి. నేరుగా చిరంజీవి సినిమాలోనే అప్పుడు అవ‌కాశం క‌ల్పించారు. తాజాగా ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల నుంచి పిలుపులు బాగానే అందుకుంటుందని టాక్. అలాగే వెబ్ సిరీస్ ల్లోనూ నటించేందుకు సిద్దం అవుతోంది.

Tags:    

Similar News