బెదురులంక ట్రైలర్.. కార్తీకేయ హిట్టు కొట్టేనా?

ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.

Update: 2023-08-16 11:13 GMT

ఆర్ఎక్స్ 100 మూవీతో కార్తీకేయ హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తికేయకు మళ్లీ, ఆ రేంజ్ లో హిట్ దక్కలేదనే చెప్పాలి. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ తర్వాత బెదురులంక 2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు.

2012 డిసెంబర్ 21వ తేదీన యుగాంతం వస్తుందని అందరూ నమ్మారు. ఆ రోజుతో అంతా సర్వ నాశనం అయిపోతుందని, ఎవరూ బతకరు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏమీ జరగలేదు. అయితే, ఆ సమయంలో జనాలు ఎలా ప్రవర్తించారు అనే దానిని కథాంశంగా తెరకెక్కించిన కథే ఈ బెదురులంక 2012.

ఆ బెదురులంక గ్రామంలో ప్రజలు యుగాంతం వార్త తెలుసుకొని ఎలా భయపడ్డారు..? దానిని ముగ్గరు వ్యక్తులు దేవుళ్ల రూపంలో ఎలా క్యాష్ చేసుకోవాలి అనుకున్నారో ఈ మూవీలో చూపించనున్నారు. అయితే, వారు చెప్పేవి నమ్మని హీరో శివ ఏం చేశాడు.? వీటితో సంబంధం లేకుండా, ఇతనిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న ఓ అమ్మాయి. తనే హీరోయిన్. ప్రేమిస్తుంది, కానీ ఆ విషయం నోటితో చెప్పదు? చివరకు ఆ యుగాంతం రోజు ఏం జరిగిందో తెలియాలంటే, ఈ సినిమా చూడాల్సిందే.

ట్రైలర్ వరకు అయితే కొత్త కాన్సెప్ట్ అని తెలుస్తోంది. మరి దానిని సినిమాగా ఎలా ముందుకు తీసుకువెళతారో చూడాలంటే, సినిమా చూస్తే కానీ తెలీదు. ఇక ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. మణి శర్మ సంగీతం అంటే పాటలు అదిరిపోతాయి అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కచ్చితంగా హిట్ అవుతుందని మూవీ టీం భావిస్తోంది.

నిజానికి, ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయ్యింది. కానీ, విడుదలకు మాత్రం ఆలస్యమౌతూ వచ్చింది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయిక గా నటిస్తోంది. ఇక, ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Full View
Tags:    

Similar News