భగవంత్​ - లియో - టైగర్​.. ఎగ్జిబిటర్లు వెనకడుగు?

ఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే.

Update: 2023-10-15 10:18 GMT

ఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నా.. ఈ సినిమాలకు ఆంధ్రాలో బిజినెస్ ఇంకా ​ స్లోగా సాగుతుందోని తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు.

వివరాళ్లోకి వెళితే.. దసరా పండగ అంటే బడా హీరోల చిత్రాలు, ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడుతాయి. పైగా ఈ సారి దసరాకు మంచి కాంబినేషన్లు తెరపై పడుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఈ చిత్రాల బిజినెస్ ఎలా ఉండాలి. హైరేంజ్​లో జోష్ చూపించాలి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రాలో లేదంట. ఇంటర్నల్ బిజినెస్ స్లోగా ఉందట. ఎందుకంటే భగవంతి కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో చిత్రాల డిస్ట్రిబ్యూటర్​ భారీ ధర కోట్ చేస్తున్నారని తెలిసింది.

ఆంధ్రలో ఆరు ఏరియాలు కలిపి దళపతి లియోకు రూ.10కోట్లు చెబుతుండగా.. బాలయ్య భగవంత్ కేసరికి రూ.34కోట్లు, మాస్ మాహారాజా టైగర్ నాగేశ్వరరావుకు రూ.17 కోట్లు కోట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. కానీ థియేటర్ల ఓనర్లు ఎగ్జిబిటర్లు మాత్రం ఇంత భారీ రేట్లతో కొనుగోలు చేసి రిస్క్​ చేయడానికి రెడీగా లేరని ట్రేడ్​ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో...

కాగా, అఖండ, వీరసింహారెడ్డిలతో వరుసగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్​లను అందుకున్న బాలకృష్ణ.. ఈ భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు. ఈ చిత్రం రన్​టైమ్​ 155 నిమిషాలు. టైగర్ నాగేశ్వరరావు.. స్టువర్ట్​పురం గజదొంగ నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ రన్​ టైమ్​ 181 నిమిషాలు.

ఇక లియో విషయానికొస్తే.. విక్రమ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్​ తర్వాత లోకేశ్ కనగరాజ్ నుంచి రాబోతున్న చిత్రమిది. దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్​గా నటించింది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూడు సినిమాలు ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటాయో..

Tags:    

Similar News