బాలయ్య భగవంత్ కేసరి.. నో డౌట్ అంతే..!

బాలయ్య మార్క్ కమర్షియల్ అంశాలు ఉంటూనే అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాను మరింత క్రేజ్ తెచ్చేలా చేస్తుందని అంటున్నారు

Update: 2023-08-28 09:15 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ లో పీక్స్ లో ఉన్నారని చెప్పొచ్చు. అఖండ వీర సింహా రెడ్డి సినిమాలతో తన మాస్ మేనియా కొనసాగిస్తున్న బాలయ్య బాబు త్వరలో భగవంత్ కేసరిగా మరొ బ్రహ్మాండం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమాపై ఎప్పుడు లేని హంగామా జరుగుతుంది. అనిల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి భారీ అంచనాలతో రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య లుక్, గెటప్ అంతా కూడా అదరగొట్టేయబోతుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

బాలయ్య లోని కామెడీ యాంగిల్ ని కూడా ఈ సినిమాలో ఎక్స్ పోజ్ చేయనున్నాడు అనిల్. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థమన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఆల్రెడీ హిట్ ఫాంలో ఉన్న బాలయ్య భగవంత్ కేసరితో మరో సూపర్ హిట్ అందుకోవడం పక్కా అనేట్టుగా బజ్ ఉంది. సినిమాపై ఫ్యాన్స్ కూడా ఎలాంటి డౌట్లు పెట్టుకొవనవసరం లేదని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

బాలయ్య భగవంత్ కేసరి సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. బాలయ్య మార్క్ కమర్షియల్ అంశాలు ఉంటూనే అనీల్ రావిపుడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా సినిమాను మరింత క్రేజ్ తెచ్చేలా చేస్తుందని అంటున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ దసరాకి మరో ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

అక్టోబర్ 15న బాలయ్య భగవంత్ కేసరి రాబోతుంది. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా నందమూరి ఫ్యాన్స్ అందరు అదిరింది అనిపించేలా చేయాలని అనీల్ రావిపుడి పనిచేస్తున్నారు. సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ క్రేజ్ ఉండగా టీజర్ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. త్వరలోనే సినిమా ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత ఈ బజ్ డబుల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను 2024 మార్చిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటుగా బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ 3వ సీజన్ కూడా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్ స్క్రీన్ మీద కూడా తనకు తిరుగులేదని అనిపించుకునే ప్రయత్నంలో బాలయ్య బాబు అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 3 కూడా త్వరలో మొదలవుతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News