అవేవి నమ్మొద్దు.. హీరోయిన్ సోషల్ మీడియా అలర్ట్..!

గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.

Update: 2025-02-11 17:30 GMT

మిస్టర్ బచ్చన్ తో తెలుగు తెరకు పరిచయమైన భామ భాగ్య శ్రీ బోర్స్. బాలీవుడ్ లో అంతకుముందు ఒక సినిమా చేసిన అమ్మడు అక్కడ జస్ట్ ఓకే అనిపించుకోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. వెంటనే రవితేజ సినిమాకు ఎంపిక చేశాడు. ఐతే మిస్టర్ బచ్చన్ రిజల్ట్ భాగ్య శ్రీ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. భాగ్య శ్రీ బోర్స్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది.


మరోపక్క దుల్కర్ సల్మాన్ తో కాంత సినిమాలో ఛాన్స్ అందుకుంది అమ్మడు. ఈ రెండు సినిమాలు పెద్ద టార్గెట్ తోనే వస్తున్నాయి. సినిమాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో భాగ్య శ్రీ అదరగొట్టేస్తుంది. అమ్మడు ఫోటో షూట్స్ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఐతే సోషల్ మీడియాలో భాగ్య శ్రీ ఫాలోయింగ్ చూసిన కొందరు ఆమె ట్విట్టర్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో ఫోటోలు పెడుతున్నారు.

ఈ విషయంపై భాగ్య శ్రీ తన ఇన్ స్టాగ్రాం లో అలర్ట్ గా రాసుకొచ్చింది. తనకు ఇన్ స్టాగ్రాం తప్ప మరెక్కడ ఖాతాలు లేవు. ట్విట్టర్ ఖాతా ఐతే అసలు లేదు. తన పేరు మీద కనిపిస్తున్న అకౌంట్ లు తనవి కాదని చెప్పుకొచ్చింది భాగ్య శ్రీ. హీరోయిన్ కి భాగ్య శ్రీకి ట్విట్టర్ ఖాతా లేదా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.

భాగ్య శ్రీ అఫీషియల్ ఇన్ స్టాగ్రాం పేజ్ ని మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. తన పేరు మీద ట్విట్టర్ లో కనిపించే అకౌంట్ తనది కాదని క్లారిటీ ఇచ్చింది భాగ్య శ్రీ. తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించింది. అందం అభినయ రెండు పర్ఫెక్ట్ గా ఉన్న భాగ్య శ్రీ ని చూస్తుంటే స్టార్ మెటీరియల్ అనిపించక తప్పదు. అమ్మడి ఖాతాలో ఒక్క హిట్ పడితే చాలు కచ్చితంగా స్టార్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. VD 12 సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్న భాగ్య శ్రీ ఆ సినిమా హిట్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News