భోళా దెబ్బతో ప్లాన్ మొత్తం చేంజ్
ఆయన తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ లో ఒకటైన శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి కథ కూడా బాలీవుడ్ నుంచి తీసుకున్నదే
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమాలు ఎలా ఉంటాయి అనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మెగాస్టార్ మళ్ళీ జీవితంలో రీమేక్ అనే సినిమాను ఎంచుకుంటారా లేదా అనేది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఒక విధంగా ఈ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో అయితే మళ్లీ ఆయన అటువైపు చూడకపోవచ్చు అనేలా అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
చిరంజీవికి రీమేక్ సినిమాలు ఏమీ కొత్తకాదు. ఆయన తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ లో ఒకటైన శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి కథ కూడా బాలీవుడ్ నుంచి తీసుకున్నదే. తర్వాత రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కూడా తమిళ రీమేక్. ఇక గాడ్ ఫాదర్ కూడా మలయాళం నుంచి తీసుకున్న కథ. ఇక మధ్యలో వచ్చిన కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య మంత్రం ఒరిజినల్ కథ. అది బాక్సాఫీస్ వద్ద 200 కోట్లను అందుకుంది.
సంక్రాంతికి రావడంతో సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది. దానికి తోడు అందులో రవితేజ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు. ఏదేమైనాప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవిపై 100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా వయసుకు తగ్గ పాత్రలు చేస్తేనే బెటర్ అనేలా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రీమేక్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కూడా ఒక రీమేక్ గా రావాల్సింది. మలయాళం లో సక్సెస్ అయిన బ్రో డాడి కథను తీసుకున్నారు. దాన్ని కళ్యాణ్ కృష్ణ తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు.
అయితే భోళా కొట్టిన దెబ్బతో ఇప్పుడు మెగా ప్లాన్స్ మొత్తం కూడా మారిపోయాయి. చిరంజీవి మళ్ళీ పూర్తిస్థాయిలో సరికొత్త కథను సిద్ధం చేయాలి అని దర్శకుడికి సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ ప్రముఖ రైటర్స్ తో కలిసి మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక డిఫరెంట్ కథను డెవలప్ చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా భోళా శంకర్ సినిమా మెగాస్టార్ కు మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. కమర్షియల్ ఫార్మాట్లో రీమేక్ సినిమాలు చేస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. కాబట్టి ఇకనైనా హీరోల్లో కాస్త డిఫరెంట్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.