బిగ్ బాస్ 8 : పోకిరి మాదిరి ట్విస్ట్.. సోషల్ మీడియాలో వైరల్..!

అంతేకాదు తన జుట్టులో చేయి పెట్టి చేతులు తల మీద నొక్కుతూ సడెన్ గా తన విగ్ గీసి పక్కన పెట్టాడు.

Update: 2024-09-05 07:31 GMT

బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా మొదలైంది. ఆదివారం హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించగా సోమవారం నుంచి టాస్కులు మొదలు పెట్టాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరు ఎలా మాట్లాడుతున్నారు.. ఎలా ఆడుతున్నారన్నది ఆడియన్స్ గమనిస్తున్నారు. మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా పూర్తైంది. ఈ వారం 14 మంది కంటెస్టెంట్స్ లో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక అందరు కంటెస్టెంట్స్ ఏమో కానీ హౌస్ లోకి వచ్చిన నాగ మణికంఠ మీద ఆడియన్స్ అసంతృప్తిగా ఉన్నారు.

హౌస్ లోకి వచ్చిన వెంటనే అనీల్ రావిపుడి ప్రాంక్ అంటూ మణికంఠని హౌస్ లో నుంచి తీసుకెళ్లాలని చూశారు. ఆ టైం లోనే మణికంఠ ట్రిగ్గర్ అయ్యాడు. ఇక అదే హౌస్ లో కొనసాగిస్తున్నాడు. నామినేషన్స్ టైం లో మరోసారి తన గతాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆడియన్స్ తో పాటు కొందరు హౌస్ మెట్స్ కూడా అతను సింపతీ గేం ఆడుతున్నాడని అనుకుంటున్నారు. నామినేషన్స్ అనంతరం మణికంఠని కన్సోల్ చేయడనికి నిఖిల్, కిరాక్ సీత అతని బెడ్ దగ్గరకు వెళ్తె లేదు ఇక నా వల్ల కాదంటూ తన కంట్రోల్ తప్పాడు మణికంఠ.

అంతేకాదు తన జుట్టులో చేయి పెట్టి చేతులు తల మీద నొక్కుతూ సడెన్ గా తన విగ్ తీసి పక్కన పెట్టాడు. మణికంఠ విగ్ తీయడం బహుశా ఇంటి సభ్యులకు కొత్త కాదేమో కానీ అతన్ని 4 రోజులుగా చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం షాక్ అయ్యేలా చేసింది. నిన్న ఎపిసోడ్ జరిగిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పోకిరి మాదిరి ట్విస్ట్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మణికంఠ మెంటల్ పొజిషన్ బాగాలేనట్టుగా ఉంది.

బిగ్ బాస్ అతన్ని కన్ఫెషన్ రూం లోకి పిలిచి కాస్త ఓదార్చినా సరే అతను ఏం చేయాలో అర్ధం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో మణికంఠకే లీస్ట్ ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది. ఐతే మణికంఠ ఇంతగా ఎమోషనల్ అవ్వడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ బిగ్ బాస్ కి వచ్చినప్పుడు కూడా అదే ఆలోచిస్తూ హౌస్ అట్మాస్పియర్ పాడు చేయడం మాత్రం కరెక్ట్ కాదని హౌస్ మెట్స్ భావిస్తున్నారు. మరి అతని విషయంలో ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News