బిగ్ బాస్ 8 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
బిగ్ బాస్ సీజన్ 8 లో చివరి వారం చివరి ఎలిమినేషన్ జరగబోతుంది. సీజన్ 8 లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో చివరి వారం చివరి ఎలిమినేషన్ జరగబోతుంది. సీజన్ 8 లో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. నామినేషన్స్ లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగిలిన ఆరుగురు ఉన్నారు. ఐతే వీరిలో ఎవరు ఈరోజు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఐతే ఈ సీజన్ లో ఎలిమినేషన్ అంతా ఆడియన్స్ ఏదైతే ఊహిస్తారో దానికి భిన్నంగా జరుగుతుంది. స్టార్ కంటెస్టెంట్ అనుకున్న వారు ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
లాస్ట్ వీక్ తేజా, పృధ్వి ఎలిమినేషన్ తెలిసిందే. తేజా ఏమో కానీ పృధ్వి ఎలిమినేషన్ షాక్ ఇచ్చింది. ఐతే ఈ వారం అవినాష్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేషన్స్ లో ఉండగా డేంజర్ జోన్ లో ఒకరిద్దరి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆల్రెడీ నిఖిల్, గౌతం టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వారు ఫైనలిస్ట్ లు అయినట్టే.. వారితో పాటు ప్రేరణ కూడా ఫైనల్ వీక్ కు చేరుతుంది.
నబీల్, విష్ణు ప్రియ, రోహిణిలో మాత్రమే ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఐతే ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన రోహిణి తన మార్క్ ఆట ఆడుతూ అవినాష్ తో కలిసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. ఐతే ఆమె ఎంత చేసినా ఓటింగ్ మాత్రం రాలేదు. తొలిసారి నామినేషన్స్ లోకి రావడంతో ఈ వారం దాదాపు రోహిణినే ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. రోహిణి కాకపోతే విష్ణు ప్రియ, నబీల్ లోకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఐతే రోహిణికి బయట ఓటింగ్ వేసే వాళ్లు తక్కువ ఉండటం వల్లే హౌస్ నుంచి ఆమె నిష్క్రమిస్తుందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం లో ముగుస్తుంది. ఈ సీజన్ విజేత విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే నిఖిల్, గౌతం మధ్య టైటిల్ ఫైట్ చాలా టఫ్ గా నడుస్తుంది. సీజన్ 8 విజేత ఎవరన్నది మరో వారంలో తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సీజన్ లో టాప్ 5 కాదు టాప్ 6 ఉంటారని ఇప్పటికే అర్థమవుతుంది. ఐతే ఆ టాప్ 6 ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.