బిగ్ బాస్ 8 : వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది వీళ్లేనా..?
బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేందుకు ఇచ్చిన టాస్కుల్లో రెండు క్లాన్లు 3 టాస్కులే గెలిచారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి టైం వచ్చేసింది. వచ్చే వారాంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు వారి గురించి ప్రస్తావించరు కానీ సీజన్ 8 లో ఏకంగా కంటెస్టెంట్స్ తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ఆపేందుకు ఒక సెపరేట్ టాస్క్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేందుకు ఇచ్చిన టాస్కుల్లో రెండు క్లాన్లు 3 టాస్కులే గెలిచారు. అందుకే సీజన్ 8 లో 12 మంది అనుకున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 9 కి చేరింది.
ఏంటి తొమ్మిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీసా అని షాక్ అవ్వొచ్చు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో చెప్పడం అయితే అలానే చెప్పాడు. మరి అంతమందిని పంపిస్తారా లేదా అన్నది చూడాలి. 14 మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం హౌస్ లో 11 మందితో కొనసాగుతుంది. ఈ వీకెండ్ ఒకరు ఎలిమినేట్ అయితే 10 మంది ఉంటారు. ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఉండదు కేవలం సీక్రెట్ రూం కే పంపిస్తారన్న టాక్ నడుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా కొత్త వారు కాకుండా ఇదివరకు సీజన్లలో చేసిన వారిని పంపిస్తారని తెలుస్తుంది. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు పాపులర్ సంపాదించిన కంటెస్టెంట్స్ ని పంపుతారని తెలుస్తుంది. అలా సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 7 నుంచి నయని పావని ఇంకా యాంకర్ రవి, జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వస్తారని తెలుస్తుంది. వీరితో పాటు మిత్ర శర్మ కూడా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తుందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 నిజంగానే పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇదివరకు సీజన్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడు ఐదు వారాలుగా ఉన్న వారితో కలిసి హౌస్ లో ఉంటారు. టాస్కుల్లో పోటీ పడతారు. సో బిగ్ బాస్ కి వెళ్లిన వారికే మరోసారి బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తున్నారు. ఇదో రకంగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మెగా ప్లాన్ అని చెప్పొచ్చు.