రామ్ పెళ్లి గురించి శివాజికి తొందర ఎందుకు..!
హోస్టింగ్ లో తన ఫాం కొనసాగిస్తున్న నాగార్జున మండే టు ఫ్రై డే జరిగే ప్రతి అంశం మీద మాట్లాడుతూ కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వాల్సిన సజెషన్స్, చెప్పాల్సిన విషయాలు చెబుతున్నాడు
బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్స్ హోస్ట్ నాగార్జున సందడి చాలా బాగుంది. హోస్టింగ్ లో తన ఫాం కొనసాగిస్తున్న నాగార్జున మండే టు ఫ్రై డే జరిగే ప్రతి అంశం మీద మాట్లాడుతూ కంటెస్టెంట్స్ అందరికి ఇవ్వాల్సిన సజెషన్స్, చెప్పాల్సిన విషయాలు చెబుతున్నాడు. శనివారం అయినా కొద్దిపాటి క్లాస్ ఉంటుందేమో కానీ ఆదివారం మాత్రం పూర్తిగా ఫన్ తో నింపేస్తారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం బిగ్ బాస్ సీజన్ 7 లో నాగార్జున ఎప్పటిలానే తన జోష్ ఫుల్ యాంకరింగ్ తో మెప్పించారు. అయితే ఆయన ఎనర్జీ ఇంకాస్త పెంచేందుకు ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని గెస్ట్ గా వచ్చాడు.
స్టేజ్ మీద ఓ పక్క నాగ్ మరోపక్క రామ్ ఇద్దరు కలిసి హౌస్ మెట్స్ తో ఒక ఆట ఆడించారు. హౌస్ లో ఉన్న శివాజికి రామ్ చాలా క్లోజ్ అనుకుంటా అందుకే రామ్ పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. త్వరగా చేసుకో బాసు అంటూ సలహా ఇచ్చాడు. మామూలుగా అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గెస్ట్ ఎవరైనా వస్తే వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారు కానీ శివాజి మాత్రం రివర్స్ లో రామ్ కి పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. పక్కనే ఉన్న నాగార్జున ఎందుకు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వవా అతన్ని కూడా ఊబిలోకి దించుతావా అని అన్నారు.
ఇక కంటెస్టెంట్స్ అంతా కూడా స్కంద సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ మూవీగా వచ్చిన స్కంద సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. రామ్ కెరీర్ లో ఎప్పుడు ఇంత భారీ యాక్షన్ సినిమా చేయలేదని చెప్పొచ్చు.
శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. రామ్ మాత్రం ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. స్కంద సినిమాతో రామ్ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మరి అది సినిమాతో సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాకు పోటీగా పెదకాపు, చంద్రముఖి 2 సినిమాలు వస్తున్నాయి.పెదకాపు స్కంద నెక్స్ట్ డే వస్తుండగా చంద్రముఖి 2 మాత్రం స్కంద రిలీజ్ రోజే వస్తుంది.