పుష్ప 2: బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఒక్కటి కాదు.. ఐదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Update: 2024-10-28 04:35 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియాలోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. థీయాట్రికల్, నాన్ థీయాత్రికల్ కలిపి 1000+ కోట్ల వ్యాపారం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఎవ్వరి అంచనాలకి అందని విధంగా ఈ సినిమా ఉండబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్మాతలు షురూ చేశారు. ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ కోసం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత స్ట్రాంగ్ గా ‘పుష్ప 2’ చిత్రాన్ని అన్ని రాష్ట్రాలలో ప్రేక్షకులకి చేరవేయడానికి భారీ ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అన్ని రాష్ట్రాలలో ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు. ప్రత్యేకంగా నార్త్ ఇండియాలో ఎక్కువ స్టేట్స్ లో పర్యటించనున్నట్లు సమాచారం.

అలాగే ‘పుష్ప 2’ కోసం ఐదు రాష్ట్రాలలో ఐదు మెగా ఈవెంట్స్ ని నిర్వహించబోతున్నారంట. వీటి కోసం వెన్యూలు త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి భారీ ఎత్తున ఫ్యాన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఈ ఈవెంట్స్ తో అల్లు అర్జున్ మానియా ఏ స్థాయిలో ఉందో తెలిసే అవకాశం ఉంది. సినిమాని ఎలా అయితే నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారో ప్రమోషన్స్ కూడా అలాగే చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్స్ చేసే అవకాశం ఉంది. ఇక పంజాబ్, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఈవెంట్ చేయాలని అనుకుంటున్నారు. కన్నడ గడ్డపై కూడా ఈవెంట్ జరగనుందని టాక్.

అల్లు అర్జున్ కెరియర్ కి ‘పుష్ప 2’ చాలా ప్రెస్టీజియస్ మూవీ. ఈ చిత్రంతో 1000 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరాలని బలంగా అనుకుంటున్నారు. ఈ సినిమా అనుకున్న ఫీట్ ని అందుకుంటే నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. రాజమౌళి హ్యాండ్ లేకుండా పాన్ ఇండియా స్టార్ గా ప్రూవ్ చేసుకున్న ఏకైక నటుడుగా అల్లు అర్జున్ మారుతాడు.

ఇప్పటికే ‘పుష్ప’ మూవీతో బన్నీ నేషనల్ అవార్డు అందుకున్నాడు. అందుకే ‘పుష్ప 2’ కోసం తగ్గేదిలే అన్నట్లుగా మూడేళ్లు ఈ సినిమా కోసం స్పెండ్ చేసి సుకుమార్ కి కావాల్సిన అవుట్ ఫుట్ ఇచ్చాడు. దేవిశ్రీ ప్రసాద్ కూడా ‘పుష్ప 2’ కి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. నెక్స్ట్ సినిమా నుంచి రాబోయే సాంగ్స్ అన్ని ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అనుకుంటున్నారు. మరి చిత్ర యూనిట్ పెట్టుకున్న అంచనాలకి ‘పుష్ప 2’ ఏ మేరకు అందుకుంటుంది అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News