1960 వరుణ్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయోగాలకు పెట్టింది పేరుగా సినిమాలు చేయడం ఆయన స్టైల్.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రయోగాలకు పెట్టింది పేరుగా సినిమాలు చేయడం ఆయన స్టైల్. ఓవైపు కమర్శియల్ సినిమాలు చేస్తూనే వైవిథ్యమైన కంటెంట్ తోనే మెప్పించడం మెగా హీరోల్లో ఆయనకు మాత్రమే చెల్లింది. ఈ విషయంలో మెగాఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఫీలవుతుంది. సాక్షాత్తు చరణ్ సైతం ఓ సందర్భంలో ఇదే విషయాన్ని గుర్తు చేసి సంతోషపడిన సంగతి తెలిసిందే. తాజాగా `పలాస` దర్శకుడు కరుణ కుమార్ -వరుణ్ 14వ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే.
తొలి సినిమా `పలాస`తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కరుణ అటుపై మెగా సంస్థలో వెబ్ సిరీస్ లాంటి అవకాశాలు రావడంతో మరింత రాటు దేలాడు. ఆయనలో క్రియేటివిటీని మెగా క్యాంప్ మరింత సానబెట్టింది. ఈ నేపథ్యంలో కరుణ చెప్పిన విభిన్నమైన కథని ప్రిన్స్ ఒకే చేసాడు. ఈ కథ కోసం ఏకంగా ఈ ద్వయం 60 ఎళ్లు వెనక్కే వెళ్లినట్లు తెలుస్తోంది. 1960 నేపథ్యంలో సాగే స్టోరీ ఖరారైంది. ఈసినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. వరుణ కెరీర్ లోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
1960 నేపథ్యం అంటే అప్పటివాతావరణంలో ప్రేక్షకుల్ని తీసుకెళ్లగలగాలి. ఇదంత ఈజీ పని కాదు. అప్పటివాతావరణం తలపించేలా ఆర్ట్ వర్క్ ఉండాలి. అందుకు తగ్గ సెట్ నిర్మాణం చేపట్టాలి. కథ మొదలు నుంచి ముగింపు వరకూ 1960 నేపథ్యమే కాబట్టి షూటింగ్ అంతా సెట్స్ మీదనే ఆధారపడి ఉంటుది. అప్పటివాతావరణం ..పరిస్థితుల్ని వివరిస్తూ అద్భుతమైన సెట్లు నిర్మించాలి. నిర్మాణంలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా జరగడానికి వీలు లేదు. పిన్ టూ పిన్ అన్ని చూసుకోవాలి.
అందుకోసం కరుణ కుమార్ ప్రత్యేకమైన టీమ్ ని సైతం రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఉన్న సాంకేతిక నిపుణులతో పాటు అవసరం మేర హాలీవుడ్ నుంచి కూడా కొంత మంది ఆర్ట్ విభాగంలో అనుభవం ఉన్న వారిని తీసుకురావాలని భావిస్తున్నారుట. ఇది పూర్తిగా రా అండ్ రస్టిక్ కంటెంట్. వరుణ్ రోల్ చాలా మాసివ్ గా ఉంటుంది. సెట్స్ కి వెళ్లడానికి ముందే నటీనటులపై ప్రత్యేకమైన లుక్ టెస్ట్ కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం.
ఇప్పటికే కథ సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా షురూ చేయబోతున్నారు. ఆయా పాత్రలన్నింటికి తగ్గట్టు మ్యాచ్ అయితేనే తీసుకుంటారని లేకపోతే కొత్త వాళ్ల కోసం టీమ్ సెర్చ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలా ఇన్ని రకాల ప్రత్యేకత గల చిత్రాన్ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.