అడవిలో సింహంతో ఆట ఆడాం.. అది ఎలా ఉంటుందో చూస్తారు..!
నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్.
నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. సితార ఎంటరటైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా గార్జియస్ బ్యూటీస్ ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా ఫిమేల్ లీడ్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లేటెస్ట్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో డైరెక్టర్ బాబీ స్పీచ్ నందమూరి ఫ్యాన్స్ ని అలరించింది.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య సినిమా జరిగే టైం లోనే నాగవంశీ వచ్చి ఆ సినిమాతో రిజల్ట్ సంబంధం లేకుండా బాలయ్యతో సినిమా చేయాలని అన్నారు. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా బాలయ్య గురించే మాట్లాడుకున్నామని అన్నారు బాబీ. బాలకృష్ణ గారిని ఒకసారి పూరీ జగన్నాథ్ ఆఫీస్ లో కలిశాను. ఆ టైం లో చాలా కూల్ గా మాట్లాడారు. అప్పుడే ఆయన సెన్సాఫ్ హ్యూమర్ గురించి తెలిసిది. ఇక బాలఋష్ణ గారు అన్ స్టాపబుల్ తో అందరికీ ఆయన గురించి తెలిసింది.
బాలకృష్ణ గారి కథ కోసం చూస్తుంటే ఆయన ఆదిత్య 369 లో ఒక పాత్ర చూపించి కథ రెడీ చేయమన్నారు. అలా తన టీం తో స్క్రిప్ట్ సిద్ధం చేశామని అన్నారు బాబీ. ఇక సినిమా చేస్తున్న టైం లో కూడా అభిమానుల కోసం ఏదైనా చేయాలి.. ఎంత కష్టమైనా పడాలని బాలకృష్ణ గారికి ఉంటుంది. తను సినిమా చేస్తున్న టైం లోనే మరో సినిమా చేయాలని అనిపించిన మొదటి హీరో బాలయ్య బాబే.
మనం సర్కస్ లో సింహాన్ని చూస్తాం.. అలా చూస్తూ తన పని చేసుకుంటుంది. కానీ బాలయ్య బాబు అడవి సింహం.. అడవిలో సింహంతో కలిసి ఆట ఆడాం..ఆయనతో కలిసి అద్భుతమైన సినిమా చేశామని అన్నారు బాబీ. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ వారి కంట్రిబ్యూషన్ గురించి చెప్పిన బాబీ లెంగ్తీ స్పీచ్ తో అలరించారు. బాబీ స్పీచ్ విన్న తర్వాత బాలకృష్ణ తో ఆయన సినిమా ఎంత శ్రద్ధగా చేశారన్నది అర్ధమవుతుంది. సినిమా తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చేలా ఉంటుందని తెలుస్తుంది.