స్టన్నింగ్ దిశాపటానీ నెవ్వర్ బిపోర్ లుక్!
ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో ఆకట్టుకోవడం దిశా పటానీకే చెల్లింది.
ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనంతో ఆకట్టుకోవడం దిశా పటానీకే చెల్లింది. ఇంతకుముందు సీకే బ్రాండ్ ప్రచారకర్తగా రకరకాల డిజైనర్ లుక్స్ తో మతులు చెడగొట్టిన దిశా ఇప్పుడు మరో వాణిజ్య ప్రకటన కోసం ఇచ్చిన ఫోజులు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దిశా అన్నివేళలా లుక్స్ పరంగా సంథింగ్ స్పెషల్ అందించాలని తపిస్తుంది. ఈసారి కూడా ఈ భామ ట్రెండీ లుక్ తో కట్టి పడేసింది. ఇటీవల జైపూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో జరిగిన పోలో అస్న్స్ ఈవెంట్‌లో రూపొందించిన ప్రకటన కోసం దిశా ఇలా సరికొత్త లుక్ లో ప్రత్యక్షమైంది.
అద్భుతమైన మెరూన్ కలర్ మోనోక్రోమ్ దుస్తుల్లో దిశా ఈ వెన్యూ వద్ద మ్యాజిక్‌ను సృష్టించింది. దిశా ఫిగర్-గ్రేజింగ్ ఫిట్ అవతార్ కి తగ్గట్టు మెరూన్ కలర్ నెక్‌లైన్ బాడీసూట్ తో రియల్ స్టన్నర్ గా నిలిచింది. ఈ లుక్ చూశాక.. దిశా పటానీ పార్టీ గర్ల్ స్టైల్ ఆకట్టుకుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలి కాలంలో యువతరాన్ని హీటెక్కించిన ది బెస్ట్ లుక్ ఇది అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... ఇటీవలే `కల్కి 2989 ఏడి`లో నటించింది. ప్రభాస్ మూవీతో పాన్ ఇండియా విజయం దక్కించుకుంది. టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఈ భామకు కెరీర్ బెస్ట్ విజయాన్ని అందించాడు. ఈ చిత్రంలో దీపిక పదుకొనే కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. తదుపరి తమిళ హీనో సూర్య నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం `కంగువ`లోను దిశా పటానీ కనిపించనుంది. కంగువ పలు భాషల్లో అక్టోబర్ 10న అత్యంత భారీగా విడుదల కానుంది.