ఫోటో స్టోరి: స‌న్న‌జాజి తీగలా ఖుషీ ఖుషీగా

మ‌రోవైపు ఖుషీ క‌పూర్ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వేడి పెంచుతున్నాయి.

Update: 2024-12-06 19:30 GMT

చూడ‌గానే స‌న్న‌జాజి తీగ‌లా క‌నిపిస్తోంది..! ఎవ‌రు ఈ ముద్దుగుమ్మ‌? అంటారా.. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ క‌పూర్. జాన్వీక‌పూర్ సోద‌రి. అక్కా చెల్లెళ్లు ఇద్ద‌రూ సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఎంతో యాక్టివ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా జాన్వీ పెద్ద స్టార్ గా ఎదిగేస్తుండ‌గా, ఖుషీ క‌పూర్ ఆరంభ ద‌శ‌లో ఉంది. `ది ఆర్చీస్` త‌ర్వాత త‌దుప‌రి భారీ సినిమాతో అభిమానుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.


మ‌రోవైపు ఖుషీ క‌పూర్ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వేడి పెంచుతున్నాయి. తాజాగా న‌ట‌వార‌సురాలు ఖుషి చీర‌క‌ట్టులో ఎంతో స్టైలిష్‌గా అందంగా క‌నిపించింది. స‌న్న‌జాజి తీగ‌లా చీర‌లో హొయ‌లు పోతున్న వైనం అంద‌రినీ ఆక‌ర్షించింది. ఖుషి ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయి. త‌న పొడుగు కాళ్ల సొగ‌సును ఈ చీర మ‌రింత‌గా ఎలివేట్ చేస్తోంద‌ని అంగీక‌రించాలి. మినిమ‌ల్ మేక‌ప్ తో ఖుషి చీర లుక్కు ఎంతో అందంగా కుదిరింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


ది ఆర్చీస్ లో ఖుషీ క‌పూర్ ప్లాస్టిక్ బొమ్మ‌లా క‌నిపించింద‌ని, త‌న‌కు న‌ట‌న రాదు అని విమ‌ర్శ‌లొచ్చాయి. దానికి ఒక అభిమాని స్పందిస్తూ.... ఆమె శ్రీదేవి కూతురంటే ఎందుకు నమ్మలేకపోతున్నారు? నటన అనేది ఒక నైపుణ్యం, కొందరికి సహజమైన ప్రవృత్తి.. వారి నుంచి న‌ట‌నా నైపుణ్యాన్ని వెలికి తీయడం సులభమే. అయితే ఇది నైపుణ్యం సాధించడానికి అభ్యాసం లాంటిది.. న‌టీమ‌ణుల‌కు గౌరవం అవసరం. .. అని ఒక నెటిజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.


నైపుణ్యం అనేది పూర్వీకుల నుండి అందుకునే జన్యుశాస్త్రం కాదు. స్టార్ కిడ్‌ని వారి తల్లిదండ్రులతో పోల్చడం స‌రికాదు. `సినిమా నా రక్తంలో ఉంది` వంటి ప‌దాల‌ను ఉప‌యోగించినా కానీ... ఎవ‌రికి వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News